Dark side
-
ఆన్లైన్ రిటైల్ మాయాజాలం
దేశీయ ఆన్లైన్ రిటైల్ రంగంలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలు, నకిలీ ఉత్పత్తుల అక్రమ రవాణా, అడ్డగోలు ధరల తగ్గింపు (ప్రిడేటరీ ప్రైసింగ్) విధానాలు సాంప్రదాయ చిరు వ్యాపారుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి, వినియోగదారుల నమ్మకానికి గండి పడుతుందని నిపుణులు, విధానకర్తలు హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్‌లో గురువారం ‘ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఫ్రాయ్)-తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాల నిరోధం’ అనే అంశంపై ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ 10 లక్షల మందికి పైగా వ్యాపారుల జీవనోపాధి కోసం పోరాడుతున్న ఫ్రాయ్ ఈ వేదికపై పలు కీలక అంశాలను లేవనెత్తింది.ఈ-కామర్స్, క్విక్ కామర్స్ చాటున ‘నకిలీ’ల దందానిమిషాల వ్యవధిలోనే వస్తువులను చేరవేసే ‘క్విక్ కామర్స్’, ‘ఈ-కామర్స్’ ప్లాట్‌ఫామ్‌లు నేడు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి, సౌందర్య సాధనాల నుంచి మొదలుకొని వేల రూపాయల విలువైన ప్రీమియం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ నిమిషాల్లో ఇంటికి వస్తున్నాయి. అయితే, ఇదే వేగవంతమైన డెలివరీ వ్యవస్థ అక్రమ, నిషేధిత, నకిలీ ఉత్పత్తుల సరఫరాకు కీలకంగా మారుతోందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి.భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తూ, క్వాలిటీ కంటే తక్కువ ధరకే ప్రాధాన్యత ఇచ్చేలా మార్కెట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన పర్యవేక్షణ వ్యవస్థల వల్ల నకిలీ వస్తువులు సులభంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని రిటైలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక సంక్షోభంగా మార్కెట్ అసమతుల్యతరోజుకు 14 నుంచి 18 గంటల పాటు కష్టపడుతూ నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేసే స్థానిక కిరాణా, చిరు వ్యాపారులు ఈ అడ్డగోలు పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఇది కేవలం వ్యాపార నష్టానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల మనుగడకు సంబంధించిన సామాజిక సమస్య అని సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ మార్కెట్ పోటీ అనేది పారదర్శకంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేదిగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రముఖుల అభిప్రాయాలుతక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి‘అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు మార్కెట్ విధానాలు ప్రామాణికంగా వ్యాపారం చేసే చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. నకిలీ వస్తువుల నెట్వర్క్ వల్ల వినియోగదారుల్లో నమ్మకం సడలుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. అక్రమ నెట్‌వర్క్‌లపై సమన్వయంతో చర్యలు తీసుకుంటూ వ్యాపారుల హక్కులను కాపాడాలి’ అని తెలంగాణ రాష్ట్ర మైనారిటీల కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ అన్నారు.వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి‘నకిలీ ఉత్పత్తుల చెలామణి అనేది కేవలం ఆర్థిక నష్టమే కాదు, ప్రజారోగ్యానికి, భద్రతకు కూడా పెను ముప్పు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో సైబర్ రిస్క్‌లు, నకిలీ సరఫరా గొలుసులపై అవగాహన లోపించింది. భారీ డిస్కౌంట్లకు ఆకర్షితులై మోసపోవద్దు. దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న స్థానిక చిరు వ్యాపారుల పాత్ర ఆర్థిక వ్యవస్థలో కీలకం. అక్రమ వ్యాపారాల అడ్డుకట్టకు ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందడుగు వేయాలి’ అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఆర్.సంజయ్ కుమార్ అన్నారు.సాంప్రదాయ వ్యాపార సంస్కృతికే ముప్పు‘స్థానిక కిరాణా దుకాణాలు కేవలం వ్యాపార కేంద్రాలు కావు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. నేడు క్విక్ కామర్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల దూకుడు, అడ్డగోలు ధరల తగ్గింపు విధానాలు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తరతరాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న కోట్లాది కుటుంబాల సాంప్రదాయ వ్యాపార సంస్కృతి నాశనమయ్యే ప్రమాదం ఉంది’ అని ఫ్రాయ్ వైస్ ప్రెసిడెంట్ (ఆల్ ఇండియా ఫ్రాయ్), ప్రెసిడెంట్ (తెలంగాణ చాప్టర్, ఫ్రాయ్) మహమ్మద్ సలావుద్దీన్ దఖ్నీ అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం!
సమాజం దృష్టిలో అతను ఒక 'సక్సెస్ఫుల్' పర్సన్. చేతినిండా జీతం, సొంత ఇల్లు, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక మనిషి తన జీవితంలో సాధించాలనుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం ఒక రకమైన శూన్యం. 42 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అంతర్మథనం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మధ్య వయసులో పురుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనంపై ఇది చర్చకు దారితీసింది.కాగితం మీద అంతా పర్ఫెక్ట్! కానీ..ఆ వ్యక్తి తన పోస్ట్‌లో తన ప్రస్తుత స్థితిని ఇలా వివరించారు.. ‘నాకు 42 ఏళ్లు. వార్షిక ఆదాయం రూ. 55 లక్షలు. చెన్నైలో సొంత ఇల్లు ఉంది. భార్య పిల్లలతో జీవితం కాగితం మీద చూస్తే చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. సమాజం నిర్దేశించిన విజయాలన్నీ నేను అందుకున్నాను. కానీ ఈ సక్సెస్ వెనుక ఏదో మిస్ అవుతున్న భావన నన్ను వెంటాడుతోంది’.యంత్రంలా మారిన 40ల జీవితం!తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అతను అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞాపకాల్లో 20లు.. ముచ్చట్లతో 30లు గడిచాయంటూ రాసుకొచ్చిన ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ తన ఒంటరితనాన్ని బయటపెట్టారు. ‘ఇప్పుడు నా ఫోన్ చాలా అరుదుగా మోగుతుంది. వచ్చే కాల్స్ అన్నీ ఆఫీస్ పని గురించో, బ్యాంక్ అలర్ట్ గురించో లేక ఇంటికి వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మని వచ్చే ఆదేశాలో మాత్రమే ఉంటున్నాయి. శారీరకంగా నేను ఒంటరిని కాకపోయినా, మానసికంగా మాత్రం ఒక యంత్రంలా మారిపోయాననిపిస్తోంది’ అని నిట్టూర్చారు.నేనొక ఏటీఎం మెషీన్నా?ఇంటికి వెళ్తే తన బాధ్యతలు తప్ప తన ఉనికికి గుర్తింపు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే. స్కూల్ ఫీజులు కట్టేవాడిగా, ఇంట్లో వైఫై పనిచేయకపోతే బాగు చేసేవాడిగా, రిపేర్లు చూసుకునే వ్యక్తిగానే నా పాత్ర పరిమితమైపోయింది. ఆఫీసులో సీనియర్ హోదాలో ఉండటంతో నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండాలని అందరూ ఆశిస్తారు. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, బలంగా కనిపించాలి. నా బలహీనతను బయటపెట్టే అవకాశం ఎక్కడా లేదు’. అని ఘొల్లుమన్నారు.ఆ 15 నిమిషాలే నా ప్రపంచం!‘కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కావాలనే కారును నెమ్మదిగా నడుపుతాను. ఆ అదనపు 15 నిమిషాలు కారులో ఒంటరిగా ఉన్నప్పుడే.. నేను మళ్లీ 'నేను'లా అనిపిస్తాను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను చేసే చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.ఈ పోస్ట్ చదివిన చాలామంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ రంగంలోని మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్, 'ఇదీ మా కథే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం ఒక్కటే జీవితం కాదని, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధాలు, వ్యక్తిగత సమయం ఎంత అవసరమో ఈ పోస్ట్ గుర్తు చేస్తోంది.Confessions and realities42M, 55LPAI am a 42-year-old man with a senior job in IT. I have a house in Chennai, a supportive wife, and two children. On paper, everything about my life looks perfect. I have achieved all the things society says a man should achieve.In my…— Dr Mouth Matters (@GanKanchi) April 29, 2026 -
అమెరికా సంచలన నిర్ణయం.. వారిని పట్టిస్తే రూ. 74 కోట్లు మీవే!
రష్యా కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సంస్థ డార్క్ సైడ్‌లో కీలక నాయకత్వం వహిస్తున్న వారిని పట్టిస్తే 10 మిలియన్ డాలర్ల(సుమారు రూ.74 కోట్లు) రివార్డును ఇవ్వనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అక్టోబర్ 4న ప్రకటించింది. గత జూలైలో కలోనియల్ పైప్ లైన్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి చేసినట్లు ఎఫ్బిఐ తెలిపింది. ఈ కంపెనీ మీద సైబర్ దాడి చేయడం వల్ల గ్యాస్ ధరలు పెరగడం భారీగా పెరిగాయి. కొద్ది రోజుల పాటు యుఎస్ ఆగ్నేయంలో ఇంధన కొరత ఏర్పడటంతో బంకులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డార్క్ సైడ్ రాన్సమ్ వేర్ సంఘటనలో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారం తెలిపితే 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 37.18 కోట్లు) వరకు రివార్డును అందిస్తున్నట్లు గతంలో విదేశాంగ శాఖ తెలిపింది. "సైబర్ నేరస్థుల దోపిడీ నుంచి ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్ వేర్ బాధితులను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ తన చిత్తశుద్దిని ప్రదర్శిస్తుంది" అని డిపార్ట్ మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్ దాడి నుంచి బయటపడటానికి హ్యాకర్లకు బిట్ కాయిన్ రూపంలో దాదాపు $5 మిలియన్లను చెల్లించినట్లు కలోనియల్ పైప్ లైన్ తెలిపింది. అమెరికా న్యాయ శాఖ జూన్ నెలలో సుమారు 2.3 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 17.10 కోట్లు) సైబర్ నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వానికి, ప్రజలకు, సంస్థలకు నష్ట కలిగించే సైబర్ నేరగాళ్ల సమాచారాన్ని తెలిపితే $10 మిలియన్ల వరకు రివార్డును ఇవ్వనున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. (చదవండి: లండన్‌లో ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..!) -
ఇక తలుచుకుంటే సాధించలేం!
వాషింగ్టన్: మనం సాధారణం ఏ పనైనా చెయ్యగలం అని స్నేహితులతో గానీ, కుటుంబసభ్యులతో గానీ అని చెప్పెటప్పుడు వాడే పదం 'నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను' అని కానీ.. ఈ పదాన్ని అమెరికాలోని పిల్లలు ఇక ముందు చెప్పలేకపోవచ్చు! ఎందుకోతెలుసా.. అందుకు ముఖ్య కారణం 'ఇంటర్నెట్'. చెప్పలేనంత ఆత్రుత, ఎప్పుడెప్పుడు కంప్యూటర్ కు అతుక్కుపోదామనే కోరిక... ఇవి అమెరికాలో ప్రస్తుతం పిల్లల్ని మానసికంగా కుంగదీసి అంగవైకల్యాన్ని కలిగిస్తున్న సమస్యలు. మొబైల్స్, కంప్యూటర్లలో ఇంటర్నెట్ వాడకానికి బానిసైన కొంతమంది పిల్లలు తాజాగా సైక్రియాట్రిక్ సెంటర్ లకు వెళ్లి వారి సమస్యను వెలిబుచ్చడంతో ఈ భయంకర సత్యం బయటకు వచ్చింది. పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లకుండా సమయాన్నంత ఇంటర్నెట్ పైనే వెచ్చించాలని అనిపిస్తుందని ఓ యువకుడు చెప్పిన మాటలు వింటుంటేనే తెలుస్తుందీ.. వారు నెట్ కు ఎలా బానిసలైపోయారో! తాజాగా వాషింగ్టన్ లో కామన్ సెన్స్ మీడియా 1,300 మంది తల్లిదండ్రులు వారి పిల్లలపై జరిపిన పరిశోధనల్లో 59 శాతం మంది పేరెంట్స్ తమ బిడ్డలు ఫోన్లకు బానిసలయినట్లు తెలిపారు. వీరిలో 50 శాతం పిల్లలు కూడా ఈ విషయాన్ని అంగీకరించడం విస్మయం కలిగించే అంశం. ఇంటర్నెట్ పిల్లల మెదళ్లలో ఎలా నాటుకుపోతోందో తెలుసుకోవడానికి అక్కడి వైద్యుల మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంకా ఎటువంటి పేరు నిర్ణయించని ఈ వ్యాధి ఇంకా ఎలాంటి విపరిణామాలకు దారీ తీస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వేల మంది తల్లిదండ్రుల వందల నుంచి వేల డాలర్లను చేతపట్టుకుని తమ పిల్లలను టెక్నాలజీ చీకటి కోణం నుంచి కాపాడాలంటూ ట్రీటెమెంట్ సెంటర్(రీస్టార్ట్) చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. తమ తల్లిదండ్రులే టెక్నాలజీకి అలవాటు పడాలంటూ ఇంటర్ నెట్ వైపు ప్రోత్సహించారని ఇప్పుడేమో అది తమ జీవితాలను నాశనం చేస్తోందని రీస్టార్ట్ సెంటర్ కు వచ్చిన ఓ బాధితుడు తెలిపాడు. ఎక్కువ మంది ఇంటర్నెట్ లో ఆన్ లైన్ ఆటలు, పోర్న్ చూడటానికి బానిసలౌతున్నట్లు ఇప్పటివరకు పరిశోధకులు కనుగొన్నారు. చైనా, దక్షిణ కొరియా, జపాన్ లు ఇప్పటికే ఇటువంటి సమస్యలపై క్యాంప్ లు నిర్వహించి అవగాహానా కార్యక్రమాలు చెపట్టగా.. అమెరికాలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఈ చేదు నిజాలపై పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


