అమెరికా సంచలన నిర్ణయం.. వారిని పట్టిస్తే రూ. 74 కోట్లు మీవే!

USA offers 10 million Dollars Reward in hunt for DarkSide cybercrime group - Sakshi

రష్యా కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సంస్థ డార్క్ సైడ్‌లో కీలక నాయకత్వం వహిస్తున్న వారిని పట్టిస్తే 10 మిలియన్ డాలర్ల(సుమారు రూ.74 కోట్లు) రివార్డును ఇవ్వనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అక్టోబర్ 4న ప్రకటించింది. గత జూలైలో కలోనియల్ పైప్ లైన్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి చేసినట్లు ఎఫ్‌బిఐ తెలిపింది. ఈ కంపెనీ మీద సైబర్ దాడి చేయడం వల్ల గ్యాస్ ధరలు పెరగడం భారీగా పెరిగాయి. కొద్ది రోజుల పాటు యుఎస్ ఆగ్నేయంలో ఇంధన కొరత ఏర్పడటంతో బంకులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ డార్క్ సైడ్ రాన్సమ్ వేర్ సంఘటనలో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారం తెలిపితే 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 37.18 కోట్లు) వరకు రివార్డును అందిస్తున్నట్లు గతంలో విదేశాంగ శాఖ తెలిపింది. "సైబర్ నేరస్థుల దోపిడీ నుంచి ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్ వేర్ బాధితులను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ తన చిత్తశుద్దిని ప్రదర్శిస్తుంది" అని డిపార్ట్ మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

సైబర్ దాడి నుంచి బయటపడటానికి హ్యాకర్లకు బిట్ కాయిన్ రూపంలో దాదాపు $5 మిలియన్లను చెల్లించినట్లు కలోనియల్ పైప్ లైన్ తెలిపింది. అమెరికా న్యాయ శాఖ జూన్ నెలలో సుమారు 2.3 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 17.10 కోట్లు) సైబర్ నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వానికి, ప్రజలకు, సంస్థలకు నష్ట కలిగించే సైబర్ నేరగాళ్ల సమాచారాన్ని తెలిపితే $10 మిలియన్ల వరకు రివార్డును ఇవ్వనున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. 

(చదవండి: లండన్‌లో ముఖేష్‌ అంబానీ కొత్త ఇల్లు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top