breaking news
Broke
-
ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ
23 ఏళ్లకే ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యి 25 ఏళ్ల వయసులో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న నేహా బైద్వాల్ ఒక స్ఫూర్తి పాఠం. అమ్మాయిల చదువును అంతగా ప్రోత్సహించని రాజస్థాన్ లో పుట్టిన నేహా మూడేళ్ల పాటు ఫోన్ ని తాకకుండా పట్టుపట్టి చదివి ఐ.ఏ.ఎస్. సాధించారు. గమ్యం చేరాలంటే ఫోన్ ని పక్కన పెట్టాలంటున్న ఆమె మాటలు చర్చను లేవనెత్తుతున్నాయి.‘మా ఇంట్లో టీవీ ఉండదు. మా నాన్నగారు టీవీని ఉండనివ్వలేదు. దాని బదులు ఒక బ్లాక్‌బోర్డ్ ఉంది. మాది జాయింట్ ఫ్యామిలీ. ఎప్పుడూ చదువుకుంటూ పరీక్షలు రాసే పిల్లలు ఐదారుమంది ఉండేవారు. వారికి ఆ బోర్డు మీద పాఠాలు సాగుతుండేవి. నేను కూడా అలాగే చదువుకున్నాను. మా నాన్న ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి భోజనం దగ్గర పిల్లలందరూ ఆ వేళ ఏం చదివారో అడిగేవారు... జవాబులు తెలుసుకునేవారు. ఎవరైనా సరిగ్గా చదవలేదని అనిపిస్తే వారికి క్లాస్ పడేది. రాజస్తాన్ కుటుంబాల్లో/పల్లెల్లో ఆడపిల్ల చదువును ప్రోత్సహించరు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆయన ఉద్యోగ రీత్యా మేమంతా ఎక్కువ సంవత్సరాలు ఛత్తిస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండటం వల్ల మా చదువుకు ఎటువంటి ఆటకం కాలేదు. చదువు ముఖ్యం అని చిన్నప్పుడే మా నాన్న నూరి΄ోశారు’ అంటుంది నేహా బైద్వాల్.2023 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమెకు 569 ర్యాంకు వచ్చింది. మొత్తం 960 మార్కులతో (ఇంటర్వూలో 151) ఆమె ఈ విజయం సాధించింది. అయితే ఇదంత సులువు కాలేదు. అందుకు నాలుగేళ్లు కష్టపడింది. మూడుసార్లు విఫలమయ్యి నాలుగోసారి విజయం సాధించింది.5వ తరగతి ఫెయిల్నేహా మొదటి నాలుగేళ్లు రాజస్థాన్‌లో ఉన్న తాతగారి ఇంట్లో చదువుకుంది. అది పల్లెటూరి. అక్కడ రాజస్థానీ మీడియంలోని చిన్న బడి ఉండేది. అయితే ఐదోక్లాస్ నాటికి తండ్రి ఆమెను తాను ఉద్యోగం చేస్తున్న చోటుకు తెచ్చి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వేశాడు. అప్పటికి ఇంగ్లిష్‌లో ఏ మాత్రం ప్రవేశం లేని నేహా ఐదోక్లాస్లో ఫెయిల్ అయ్యింది. స్కూల్ వాళ్లు హిందీ మీడియంలోకి వేస్తామన్నారు. కాని నేహా పట్టుదలతో ఆరో క్లాస్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో పుంజుకుంది.లాయర్ కావాలనుకుని...నేహా అడ్వకేట్ అవుదామనుకుంది. ‘బాధితులకు న్యాయం జరగాలంటే అదొక మంచి మార్గం అనుకున్నాను’ అంటుందామె. కాని అంతకంటే ఎక్కువమందికి నువ్వు మేలు చేయాలంటే ఐ.ఏ.ఎస్ కావాలి అని తండ్రి దిశా నిర్దేశం చేశాడు. రాయ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో డిగ్రీ చదివిన నేహా అందుకు మార్గం ఏమిటని తండ్రిని అడిగితే కాలాన్ని గెలవడమే అని చె΄్పాడు. ‘పనికిరాని వాటికి సమయాన్ని వృథా చేయడం కంటే దానిని పూర్తిగా సద్వినియోగం చేయడమే విజయానికి మార్గం అని తెలుసుకున్నాను’ అంటుంది నేహా. టీవీ లేని ఆ ఇంట్లో ఆమె ఇక ఫోన్ కూడా పక్కన పెట్టేసింది. ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ, ప్రిపరేషన్ జరిగే చోటు.నాలుగోసారి‘నేను ఆశాజీవిని. ఓడి΄ోక ప్రయత్నించడం మన బాధ్యత’ అంటుంది నేహా. నేహాకు మొదటి అటెంప్ట్‌లో అసలేమీ రిజల్ట్ కనపడలేదు. రెండో అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో 2 మార్కులు తక్కువ రావడంతో అర్హత రాలేదు. మూడో అటెంప్ట్‌లో మెయిన్స్‌లో అర్హతకు 8 మార్కులు తక్కువ వచ్చాయి. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగోసారి మళ్లీ పరీక్షకు కూచోవడం ఎవరికైనా కష్టమే. కాని నేహా నాలుగోసారి రాసింది. ఈసారి ఆమె శ్రమ వృథా కాలేదు. 2023 సంవత్సరంలో ఆమెకు 569వ ర్యాంకు వచ్చింది. గుజరాత్ కేడర్ అలాట్ అయ్యింది. శిక్షణ తర్వాత గుజరాత్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ΄ోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిన్ను నీవు మోసం చేసుకోకుండా కష్టపడితే విజయం తథ్యం’ అంటోందామె.అందరూ తోడేనేహా చదువుకుంటూ ఉంటే ఒక్కోరోజు ఒక్కొక్కరు తోడు కూచునేవారు. ఒకరోజు తండ్రి, మరోరోజు బాబాయి... ‘మేమున్నాం తోడుగా. నీ ప్రిపరేషన్ నువ్వు, మేము నీకు తోడు అనే భరోసా దీని ద్వారా అందేది’ అంటుంది నేహా. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు. వారిలో ఒక తమ్ముడు మెయిన్స్‌కు అన్ని ప్రశ్నలు సమయానికి రాయడం ఎలాగో టిప్స్ చెప్పి సాధన చేయించాడు. ‘మా ఇంట్లో రోజూ నాకు మాక్ ఇంటర్వ్యూలు ఉండేవి. రోజూ ఎవరో ఒకరు ఐ.ఏ.ఎస్. కోసం బోర్డు ఎలా అయితే ప్రశ్నలు అడుగుతుందో అలా ప్రశ్నలు ప్రిపేరయ్యి మరీ నన్ను అడిగేవారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది నేహా. -
‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్ ఎదుట హామీనిచ్చాడు.అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి.. -
మెక్సికోలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
మెక్సికోలోని ఓ మద్యం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా పేలుడు సంభవించి, తరువాత ఫ్యాక్టరీ అంతటా మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర పౌర రక్షణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రమాద వివరాలను తెలియజేసింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులంతా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని ఏజెన్సీ తెలిపింది. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో నిపుణులు ఉన్నారని రాష్ట్ర పౌర రక్షణ శాఖ డైరెక్టర్ విక్టర్ హ్యూగో రోల్డాన్ తెలిపారు. -
‘అమర్కంటక్’లో మంటలు... తప్పిన ముప్పు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మిస్రోడ్- మందీదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారులకు తెలియజేశారు. బీ-3, బీ-4 ఏసీ కోచ్‌ల కింద మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అగ్ని నిరోధక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఉదంతంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అమర్‌కాంత్ ఎక్స్‌ప్రెస్ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు 27 హాల్ట్‌లు ఉన్నాయి. -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి!
దేశరాజధాని ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రి నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఊపిరాడక మరణించారు. మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో నలుగురు ఊపిరాడక మృతి చెందారని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, పార్కింగ్‌లో మంటలు చెలరేగడంతో భవనం అంతటా పొగలు వ్యాపించాయన్నారు. రోడ్డు ఇరుకుగా ఉన్నప్పటికీ అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
Viral Video: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది
ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్రీ ప్లాన్‌గా ఉన్న ఊహించిన విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్చం అలానే ఒక జంట ఫ్రాంక్ వీడియో కోసం చేస్తుండగా ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. ఐతే కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ...భార్యలకు తెలియకుండా ఫ్రాంక్ చేసేందుకు యత్నిస్తాడు. అందులో భాగంగానే విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. పాపం అతడి భార్య ఐమ్ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) (చదవండి: విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...) -
ఫిలిపీన్స్‌లో బద్దలైన అగ్నిపర్వతం
-
24మంది భార్యలు.. 200మంది పిల్లలు!
బీజింగ్ః బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండి, జీవితకాలాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు చేసిన ప్రయత్నాలు , వారి సాధన ఒక్కోసారి తగిన ఫలితాలను కూడ ఇస్తుంటుంది. కానీ అరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉండటమే కష్టంగా మారిన తరుణంలో ఓ వ్యక్తి వందేళ్ళు బతికితే ఎంతో గొప్పగా ఫీలవుతాం. నిజంగా గ్రేట్ అని సంబర పడిపోతాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడంటే నమ్ముతారా? ఎప్పుడూ ఎవ్వరూ జీవించనంతకాలం ఆయన బతికినట్లు ఇటీవల ఓ పత్రికా కథనం ద్వారా ఆధారాలు దొరికాయి. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. అయితే అప్పటికి ఆయన వయసు 256 ఏళ్ళని, అన్నేళ్ళు జీవించడం చరిత్రలోనే మొదటిసారి అని ఓ పత్రిక తన వ్యాసంలో పేర్కొంది. ఆ సుదీర్ఘ వయస్కుడి వివరాలు ఏ ఒక్కరో శోధించినవి కాదని, ఆయన అన్నేళ్ళు బతికాడనేందుకు ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించి మరీ నిర్థారించింది. లీని ఆయన 150వ పుట్టినరోజు సందర్భంగా 1827 లో అభినందిచినట్లు ఓ డాక్యుమెంటేషన్ లో చెంగ్డూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వు చుంగ్ రాశారని, చైనా ప్రభుత్వ రికార్డుల్లోనూ లీ చింగ్ 150వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఉందని, అనంతరం ఆయన 200 పుట్టినరోజు సందర్భంగా 1877లోనూ లీని అభినందిస్తూ ఎన్నో వ్యాసాలు, పత్రాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఆయనకు పొరుగునే ఉన్న ఓ వ్యక్తి... తమ చిన్ననాటినుంచే ఆయన్ను వృద్ధుడుగా చూసినట్లు తెలిపినట్లు సదరు పత్రిక వెల్లడించింది. సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ళ వయసునుంచే ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగాడట. ఆ సమయంలో దాదాపు నలభై ఏళ్ళ పాటు అడవుల్లో దొరికే మూలికలు, గోజీపండ్లు వంటి ఆహారాన్నే భుజించాడట. ఆయుర్వేద వైద్యుడిగా అనేకచోట్ల కాలం గడిపిన ఆయన.. 71 ఏళ్ళ వయసులో 1749 లో చైనీస్ సైన్యం లో యుద్ధ కళల శిక్షకుడిగా, సలహాదారుడుగా చేరాడు. తర్వాత కనీసం వంద సంవత్సరాల పాటు ఆయన మంచి ఆహారంతోపాటు, ఔషధాలు, రైస్ వైన్ తీసుకున్నాడు. తన కమ్యూనిటీలో ప్రత్యేక సభ్యుడుగా ఉండే లీ.. 23 సార్లు వివాహం చేసుకోవడంతోపాటు, సుమారు 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడట. కుటుంబంలో 11 తరాలను చూసిన ఆయన... 1933లో మరణించాడు. ఆయన్ను ఎవరైనా తన సుదీర్ఘ జీవితకాలం గురించి సీక్రెట్ ఏమిటి అని అడిగితే మాత్రం... నిశ్శబ్దమైన మనసుతో ఉండి, తాబేలులా కూర్చొని, పావురంలా హుషారుగా పరిగెడుతూ, కుక్కలా నిద్రపోవడమే కారణమని చెప్పేవాడట. ఆయన పుస్తకంలో (జీవితం) ఒక పేజీ చదివినా... ఈ కాలంవారికి ఎంతో స్ఫూర్తిదాయకం అయ్యే అవకాశం ఉంది.