breaking news
attempts suicide
-
ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం..!
నారాయణపేట: నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఓ కండక్టర్ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కండక్టర్ జీఆర్‌రెడ్డి అనార్యోగ రీత్యా తాను కండక్టర్ డ్యూటీ చేయాలేనని, ఓడీ (అదర్ డ్యూటీ) వేయాలని ఆర్టీసీ డీఎం లావణ్య వద్దకు శుక్రవారం ఉదయం 11 గంటల చేరుకుని మొర పెట్టుకున్నారు. అయితే రెండు, మూడు రోజులు విధులు నిర్వహిస్తే ఓడీ అవకాశం కల్పిస్తామని అది కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తేల్చిచెప్పింది.దీంతో కండక్టర్ డీఎంతో వాదించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన కండక్టర్ తన వద్ద ఉన్న థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవడంతో పక్కనే ఉన్న కండక్టర్, డ్రైవర్లు లాక్కున్నారు. కండక్టర్ మింగిన టాబ్లెట్స్‌ను నీళ్లు తాపి కక్కించడంతో ప్రాణాల ముప్పు నుంచి తప్పించినట్లయింది. ఆ తర్వాత మళ్లీ డీఎం వద్దకు వెళ్లగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే సమస్య పరిష్కారం అవుతుందా అంటూ మందలించారు. మీడియా ప్రతినిధుల అడ్డగింత.. కండక్టర్ ఆత్మహత్య సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే సీన్ రీవర్స్ అయింది. ముందుగా డిపో గేటు వద్దకు చేరుకున్న మీడియాను లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత డీఎం పర్మిషన్ తీసుకొని లోపలికి వదిలారు. కండక్టర్ జీఆర్ రెడ్డితో విలేకరులు మాట్లాడగా అనారోగ్య సమస్యతోనే డ్యూటీ చేయలేకపోతున్నానని చెప్పారు. జీఆర్ రెడ్డి గత రెండేళ్లుగా 8 నెలలు సిక్ లీవులు పెడుతూ.. 8 రోజులు డ్యూటీ చేస్తున్నట్లు డీఎం రికార్డులను విలేకరులకు చూపించారు. అనంతరం డీఎం ఈ విషయాన్ని ఆర్టీసీ ఆర్ఎంకు చెప్పడంతో కండక్టర్‌ను మందలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కండక్టర్‌కు న్యాయం చేస్తారా.. మరేమైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచిచూడాల్సిందే మరి. -
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్ చేస్తోంది. -
మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఉమెన్స్ క్యాంపస్‌లో ఆత్మహత్యకు యత్నించింది. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు కిటికీ నుంచి దూకేందుకు యత్నించింది.గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం. -
భార్య కాపురానికి రావడంలేదని.. సెల్‌టవర్ ఎక్కాడు
చిన్నశంకరంపేట: భార్య కాపురానికి రావడంలేదని ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. చనిపోతానంటూ బెదిరించాడు. చాకచర్యంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కిచ్చుగారి ప్రభాకర్‌కు పాపన్నపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. మూడేళ ్ల క్రితం ప్రభాకర్‌తో గోడవపడి తల్లిగారింటికి వెళ్లింది. అయితే కాపురానికి రావాలని నాటి నుంచి ఆమెను కోరుతుండగా నిరాకరించింది. దీంతో మానసిక క్షోభకు గురైన ప్రభాకర్ ఆదివారం స్థానిక రైస్‌మిల్ పక్కన ఉన్న సెల్ టవర్‌ను ఎక్కాడు. అతడిని గమనించిన స్థానికులు కిందకు దిగాల్సిందిగా ప్రభాకర్ కోరారు. విషయం పోలీస్‌లకు అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ నగేష్ యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ విషయంపై ఆరా తీశాడు. యువకుడి భార్యను రప్పించేందుకు ఎర్పాట్లు చేస్తున్నానని మాటల్లో పెట్టిన ఎస్ఐ ఇద్దరు యువకులను టవర్‌పైకి పంపించారు. టవర్‌పైకి వెళ్లిన యువకులు ప్రభాకర్‌ను సమాదాయించినా వినలేదు. దీంతో ఎస్ఐ నగేష్ పాపన్నపేట ఎస్ఐ శ్రీకాంత్‌కు ఫోన్ చేసి యువకుడితో మాట్లాడించారు. దీంతో యువకుడు శాంతించి కిందకు వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం తల్లి,తండ్రులకు యువకుడిని అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైంది.


