breaking news
Akash Singh
-
వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్‌గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్‌కు ఆ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జురెల్‌తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. 𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026Just when we thought we'd seen it all 😅🎥 How has that evaded the stumps? 😮Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026 -
తుదిజట్టులో లేకున్నా.. జహీర్ ఖాన్ వల్లే ఇలా!
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ఆకాశ్ సింగ్ వికెట్ పడగొట్టినప్పుడల్లా జేబులోంచి ఒక కాగితాన్ని బయటకు తీసి చేసుకున్న సంబరం అందరినీ ఆకర్షించింది. అక్కీ ఆన్ ఫైర్చెన్నై ఇన్నింగ్స్‌లో టాప్–3 బ్యాటర్లు సంజూ సామ్సన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్‌లను అవుట్ చేసినప్పుడు అతను తన ఆనందాన్ని ప్రదర్శించాడు. దానిపై ఇంగ్లిష్‌లో.. ‘అక్కీ ఆన్ ఫైర్–టీ20ల్లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’ అనే వాక్యాలు రాసి ఉన్నాయి.అది కాగితం మాత్రమే కాదు కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న 24 ఏళ్ల ఆకాశ్ ఇలా చేయడంపై కొన్ని విమర్శలు వచ్చినా... వాటికి అతను వివరణ ఇచ్చాడు. అది కాగితం మాత్రమే కాదని, తనలో స్ఫూర్తి నింపే మాటలని స్పష్టం చేశాడు. ఆ చీటీని తాను ఈ మ్యాచ్ కోసమే తీసుకు రాలేదని, ఇలాంటివి రాసుకొని ప్రేరణ పొందడం తనకు మొదటి నుంచి అలవాటు ఉందని ఆకాశ్ అన్నాడు.‘వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అంశాల నుంచి స్ఫూర్తి పొందుతారు. నేను అలాంటి కాగితాన్ని ఎప్పుడూ బయటకు తీసి చూపించకపోవచ్చు. కానీ నా మనసులో వాటి గురించి ఆలోచన ఉంటుంది. ఏదైనా ప్రేరణనిచ్చే విషయం రాసిన చీటీ జేబులో ఉంటే అది మీ ప్రదర్శనను గుర్తు చేస్తూ ఉంటుంది. ఏదైనా అనుకొని వచ్చి నిజంగా దానిని చేసి చూపించగలగడం ముఖ్యం.అలాంటి రాతలు ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఆలోచన వస్తే దానిని వెంటనే రాసుకుంటాను. మ్యాచ్‌కు ముందు రోజు వచ్చిన ఆలోచననే కాగితంపై పెట్టి తీసుకొచ్చాను. నేను ఈ మ్యాచ్ ఆడబోతున్నానని రెండు రోజుల ముందు ప్రాక్టీస్ సెషన్లో తెలిసింది’ అని ఆకాశ్ వ్యాఖ్యానించాడు.తుదిజట్టులో లేకున్నా.. జహీర్ ఖాన్ వల్లే ఇలా!కాగా 2025 సీజన్లో కూడా లక్నో జట్టులో ఉన్న ఆకాశ్ 3 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు సీజన్లుగా లక్నో ఫ్రాంచైజీ తనను ప్రోత్సహిస్తూ అండగా నిలిచిందని, దాని వల్లే తన ఆట మరింత మెరుగైందని అతను పేర్కొన్నాడు. ‘నేను తుది జట్టులో లేని సమయంలో కూడా కోచ్‌లు నాకు సరైన మార్గనిర్దేశనం చేశారు. గత ఏడాది జహీర్ ఖాన్, ఈసారి భరత్ అరుణ్ నన్ను నడిపించారు. ఎప్పుడు అవకాశం లభించినా సత్తా చాటేలా నన్ను సిద్ధం చేశారు. కెపె్టన్ పంత్ కూడా మద్దతునివ్వడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.కొత్త బంతితో నేను మెరుగ్గా బౌలింగ్ చేయగలనని గుర్తింపు అవకాశం కల్పించారు. పిచ్‌పై మంచి బౌన్స్ కూడా ఉండటంతో చెన్నైపై మూడు వికెట్లు తీయగలిగాను’ అని ఆకాశ్ వివరించాడు.అండర్–19 స్థాయి నుంచి వచ్చి...ఆకాశ్ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్పూర్. జైపూర్ శివార్లలోని హథోడ్లో ఉన్న ఆరావళి క్రికెట్ క్లబ్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఆకాశ్‌తో పాటు ఐపీఎల్లో ఆడుతున్న అశోక్ శర్మ (గుజరాత్), ముకుల్ చౌదరి (లక్నో), కార్తీక్ శర్మ (చెన్నై) కూడా అక్కడి నుంచి వచ్చినవారే.ఇక 2019లో రాజస్తాన్ జట్టు తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్ రెండేళ్ల తర్వాత అదే టీమ్ తరఫున వన్డేలు కూడా ఆడాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అవకాశం రాకపోవడంతో నాగాలాండ్ జట్టుకు మారిన ఆకాశ్ 2022లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. గత సీజన్లో అతను మళ్లీ రాజస్తాన్‌కు తిరిగొచ్చి రంజీ మ్యాచ్‌లు ఆడాడు. 2020 అండర్–19 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన ఆకాశ్... ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లతో జరిగిన గొడవలో భాగంగా ఉండటంతో ఐసీసీ శిక్షకు కూడా గురయ్యాడు.పడుతూ లేస్తూపోటీ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఇన్నేళ్లయినా...ఆకాశ్ ఐపీఎల్ ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది. 2021లో తొలిసారి రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతను ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు! తర్వాతి సీజన్లో అవకాశం రాకపోగా... 2023లో ముకేశ్ చౌదరీ గాయపడటంతో అతని స్థానంలో ఆకాశ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఆరు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసిన అతను టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలవడం విశేషం. ఇక 2024లో మళ్లీ ఐపీఎల్ చాన్స్ దక్కలేదు కానీ గత సీజన్‌నుంచి లక్నో టీమ్‌తో ఉన్నాడు. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన కేకేఆర్ ఓపెనర్ -
ఇదంతా నాన్సెన్స్!.. సౌతాఫ్రికా దిగ్గజం ఫైర్
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ మహరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్.. 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.తన అద్భుత స్పెల్‌తో చెన్నై టాపార్డర్‌ను ఆకాశ్ సింగ్ కుదేలు చేశాడు. ఓపెనర్లు సంజూ శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (13).. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (6)ను పెవిలియన్‌కు పంపి చెన్నైని నామమాత్రపు స్కోరు (187)కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.క్రీడా వర్గాల్లో చర్చఅయితే, కీలక వికెట్లు తీసిన సంతోషంలో ఆకాశ్ సింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘‘అక్కీ ఆన్ ఫైర్.. టీ20 మ్యాచ్‌లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’’ అని రాసి ఉన్న నోట్ చూపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.అప్పటి నుంచి..ఈ నేపథ్యంలో ఆకాశ్ సింగ్ చర్యపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘పేపర్ ట్రెండ్’ మానుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. ‘‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’’ అంటూ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అభిమానులకు అంకితమిస్తూ నోట్ చూపించాడు.అప్పటి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ సైతం ఇదే తరహాలో నోట్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఉర్విల్ పటేల్ సైతం.. ‘‘ఈ ఇన్నింగ్స్ నీకోసమే నాన్నా’’ అని రాసి ఉన్న పేపర్ చూపించాడు. తాజాగా ఆకాశ్ ఇదే పనిచేశాడు.నిజం చెప్పాలంటేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఈ పేపర్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇకపై ఇదేమీ ట్రెండ్ కాబోదు. నిజం చెప్పాలంటే గతంలోనూ దీనిని ట్రెండ్‌గానూ ఎవరూ గుర్తించలేదు’’ అని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఇక భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడి అభివ్యక్తి అది. అయితే, చాలా మందికి ఇది నచ్చలేదు. ఇదొక రకంగా సరదాగా.. అదే సమయంలో చెత్తగా ఉంది.ఇదంతా నాన్సెన్స్ఈ చిట్టీల బిజినెస్‌ను నిషేధించాలి. ఇదంతా నాన్సెన్స్. వాళ్లు మైదానంలోకి ఇలా చిట్టీలు తీసుకురావడం నాకైతే నచ్చడం లేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. విమర్శలపై ఆకాశ్ సింగ్ స్పందించాడు.‘‘నాకు ఇలా చేయడం స్ఫూర్తినిస్తుంది. అంతే తప్ప మైదానంలోకి నోట్ తీసుకురావడంలో వేరే ఉద్దేశం లేదు. మ్యాచ్ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చే వాటిని నేను వదిలేయలేను’’ అని ఆకాశ్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ


