Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్‌గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.
ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్‌కు ఆ ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో జురెల్‌తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్‌లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.
దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.
అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు.
𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀
Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇
Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026
Just when we thought we'd seen it all 😅
🎥 How has that evaded the stumps? 😮
Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026


