
నాలుగు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు బుధవారం(25-12-2024) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. దీనిలో భాగంగా లింగాల మండలం తాతిరెడ్డి పల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చూసిన క్షణం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరలేసింది. తరలివచ్చిన అభిమాన సంద్రం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టింది.

















































