ఓడిపోతాననే భయంతోనే తాను ఆటలకు దూరంగా ఉండేదానినని హీరోయిన్ సమంత అన్నారు.
అయితే, ‘పికిల్‌బాల్’ అంతా మార్చేసిందని.. తన టీమ్ చెన్నైసూపర్‌చాంప్స్‌ను చూశాక భయాలన్నీ తొలగిపోయానని పేర్కొన్నారు.
తమ జట్టు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డిందని.. పికిల్‌బాల్ జట్టు యజమానిగా తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా తన జట్టు సభ్యులతో ఉన్న ఫొటోలు పంచుకున్నారు.


