కర్ణాటక క్రికెటర్ అభిమన్యు మిథున్
అక్టోబరు 25, 1989లో బెంగళూరులో జన్మించిన అభిమన్యు
టీనేజ్‌లో అథ్లెటిక్స్, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొన్న అభిమన్యు
పదిహేడవ ఏట క్రికెట్‌లో అడుగుపెట్టిన అభిమన్యు.. రైటార్మ్ మీడియం పేసర్‌గా ఎదిగాడు.
మూడేళ్ల అనంతరం 2009-10 రంజీ సీజన్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ఎంట్రీ
రంజీ డెబ్యూ తర్వాత పది వారాలకే టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అభిమన్యు
సౌతాఫ్రికా 2009-10 టెస్టు సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపిక.. తుదిజట్టులో మాత్రం స్థానం దక్కలేదు
అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం ఆడే అవకాశం అభిమన్యుకు వచ్చింది. అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా 2010లో వన్డే మ్యాచ్ సందర్భంగా అభిమన్యు అరంగేట్రం చేశాడు
అదే ఏడాది జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు
తన కెరీర్‌లో టీమిండియా తరఫున మొత్తం 4 టెస్టులు, 5 వన్డేలు ఆడిన అభిమన్యు మిథున్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 9, 3 వికెట్లు తీశాడు
ఇక ఐపీఎల్-2009 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన అభిమన్యు హ్యాట్రిక్ తీశాడు
ఇక 2019లో అభిమన్యు ఓ అరుదైన రికార్డు సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు సహా టాప్ లెవల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు
ఐపీఎల్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అభిమన్యు ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు
ఇక అభిమన్యు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. రేయన్ అనే అమ్మాయిని 2016, ఆగష్టు 28న పెళ్లాడాడు
రేయన్ మరెవరో కాదు.. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన సీనియర్ నటీమణి రాధికా శరత్‌కుమార్ కూతురు. అలా రాధికకు అభిమన్యు స్వయానా అల్లుడు అయ్యాడు.
అభిమన్యు- రేయన్ జంటకు కూతురు రాయనే హార్డీ, కుమారుడు రాహుల్ శరత్‌కుమార్ ఉన్నారు
కాగా రాధికకు తన రెండో భర్త, బ్రిటిష్ జాతీయుడు అయిన రిచర్డ్ హార్డీ ద్వారా రేయన్ జన్మించింది. అయితే, అతడి నుంచి విడిపోయిన రాధిక 2001లో శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంది


