
ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

విజయోత్సవాల్లో భాగంగా ఆక్టోపస్ సిబ్బంది ప్రద ర్శించిన విన్యాసాలు అలరించాయి. పోలీస్ బ్యాండ్ బృందాలు ఆకట్టుకున్నాయి.



































