
దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఎ) లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.

భారత వైమానిక దళంలోని ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ శాఖలకు చెందిన 254 మంది ఫ్లైట్ కేడెట్ల ప్రీ- కమిషనింగ్ శిక్షణ విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు ఆద్యంతం సందర్శకులను అబ్బురపర్చాయి.

ఆకాశ్ గంగ, ఎయిర్ వారియర్ డ్రిల్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంలు గగుర్పొడిచే ప్రదర్శనలు చేశాయి. పైలటస్ పీసీ-7 ఎంకే-2, హాక్, కిరణ్ ఎంకే-1, చేతక్ ట్రైనర్ విమానాల విన్యాసాలు సైతం ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.





















