సీఎం... మంత్రులు... అధికారులు... ఒక్కటిగా కదలి వస్తున్నారు. పరిశుభ్రతకే పరిమితం కాకుండా... బస్తీలు... కాలనీల్లో నెలకొన్న చిన్నపాటి సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమిస్తున్నారు. ఇది జనాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఉల్లాసంగా పాల్గొనేలా చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుసగా నాలుగో రోజైన మంగళవారం(18-05-2015) కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రివర్గం... అధికార యంత్రాంగం పాల్గొన్నారు. చెత్త కుప్పలు తొలగించడంతో పాటు మురుగు కాలువలు శుభ్రం చేయడం... రహదారులకు మరమ్మతుల వంటి పనులు చేపట్టారు. ఈ పనుల్లో స్థానికులూ మమేకమయ్యారు. తమ ప్రాంతాన్ని బాగు చేసుకునేందుకు ముందుకొచ్చారు.
చార్మినార్ వద్ద ‘స్వచ్ఛ’ ప్రతిజ్ఞ చేయిస్తున్న గ్రేటర్ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ తదితరులు, హాజరైన ప్రజలు
చార్మినార్ వద్ద ‘స్వచ్ఛ’ ప్రతిజ్ఞ చేయిస్తున్న గ్రేటర్ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ తదితరులు, హాజరైన ప్రజలు
మారేడ్‌పల్లిలో మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి
గంగాబౌలిలో మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి..
మన్సూరాబాద్ నాంచారమ్మబస్తీలో మంత్రి జగదీష్‌రెడ్డి
చార్మినార్ వద్ద చెత్తను తొలగిస్తున్న విద్యార్థులు
నల్లకుంటలో స్పీకర్ మధుసూదనాచారి
సీఎం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పద్మారావు
మలేసియా సర్కిల్‌లో బుల్లితెర నటి అంజు అస్రాని...
మారేడుపల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాల విద్యార్థినిల ప్రతిజ్ఞ
బైబిల్ హౌస్ వద్ద సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్
బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, ఎంపీ కేకే తదితరుల పాదయాత్ర
రాంనగర్ ఎస్‌ఆర్‌కెనగర్‌లో మంత్రి నాయిని
సీసీ నగర్‌లో మంత్రి తలసాని..
ఏజీ వర్సిటీ ఆవరణలో మండలి చైర్మన్ స్వామిగౌడ్...
బండచెరువు వద్ద మంత్రి ఈటల రాజేందర్...
ఇందిరానగర్ జీపీఆర్ క్వార్టర్స్ సీవీ ఆనంద్...
సంతోష్‌నగర్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ...
చార్మినార్ వద్ద ఎంపీ అసదుద్దీన్...
గుడిమల్కాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు...
ఖాద్రిబాగ్‌లో మట్టికుప్పలను తొలగిస్తున్న మంత్రి పోచారం
జూబ్లీ బస్టాండ్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి


