
గుర్రంపై కాదు ఎదురు బుంగలపై స్వారీ.. ఆదిలాబాద్ జిల్లాలోని మామాడిగూడాలలో చిన్నారుల సరదా - రాజ్కుమార్, ఆదిలాబాద్

సెల్ఫీ సూపర్.. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సెల్పీ దిగుతున్న విద్యార్థినులు- రూబెన్, గుంటూరు

భక్తి పారవశ్యం.. గుంటూరులో శ్రావణమాసం తొలి శుక్రవారం మహిళల పూజలు - రూబెన్, గుంటూరు

రవీంద్రభారతిలో జరిగిన యువనాటకోత్సవంలో భాగంగా రజాకార్ నాటకంలోని దృశ్యం - డి.రాజేష్, హైదరాబాద్

ఈ వర్షం సాక్షిగా.. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ రహదారి - డి.రాజేష్, హైదరాబాద్

నిలువెల్లా జాతీయాభిమానం.. స్కూటర్కు జాతీయ జెండాలు కట్టుకుని వెళ్తున్న కుత్బుల్లాపూర్ గురుమూర్తినగర్కు చెందిన అఫ్జల్. - దశరథ్ రజ్వా, హైదరాబాద్

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. కుత్బుల్లాపూర్ మండలం నాగులూరులోపొలం పనులకు వెళ్తున్న ఓ మహిళ - దశరథ్ రజ్వా, హైదరాబాద్

సాగరకన్య.. అద్భుతమైన కళారూపం - నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

విదేశీ యువతుల నృత్యం - నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

హైదరాబాద్లో విచిత్ర వేషధారణలో సందడి చేస్తున్న దృశ్యం - నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

స్టేట్ స్కూల్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఓ చిన్నారి వేషధారణ- రాకేష్, హైదరాబాద్

పోతురాజు వేషధారుడి వెనక బోనాలు తీసుకెళ్తున్న మహిళలు- రవికుమార్, హైదరాబాద్

పెంపుడు కుక్కతో సరదాగా.. -టి.దయాకర్, హైదరాబాద్

భలే ముద్దొస్తోంది.. నెక్లస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలోని డాగ్స్ పార్కులో పెంపుడు కుక్కపిల్లతో.. - టి.దయాకర్, హైదరాబాద్

వానవాన వెల్లువాయె.. కుండపోత వర్షానికి వాగులా మారిన కడపలోని ఓ రహదారి- రవికుమార్, కడప

నిరీక్షణ.. కడపలో ఓ భవంతి గేట్ ముందు పిల్లలు, పెద్దలు - టి.రమేష్, కడప

క్యా సీన్ హై.. సంధ్యాసమయంలో ఫొటో తీస్తున్న ఓ యువకుడు - ఆర్. రాజు, ఖమ్మం

మంత్రుల ఫొటో సరదా.. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫొటో తీస్తున్న మరో మంత్రి హరీష్ రావు - ఆర్. రాజు, ఖమ్మం

కర్నూలులో భారీ వర్షం మధ్య రోడ్డుపై పరుగులు తీస్తున్న యువకులు- హుస్సేన్, కర్నూలు

దేవుడే అండ దండ.. కరీంనగర్లో వినాయక ప్రతిమ వద్ద ఆడుకుంటున్న పిల్లలు స్వామి, కరీంనగర్

స్నేహమంటే ఇదేరా.. కుక్కతో కోతి సరదా దృశ్యం - భాస్కరాచారి, మహబూబ్ నగర్

కోయిల్సాగర్లో తండ్రితో కలసి చేపల వేటకు వెళ్తున్న కూతురు -భాస్కరాచారి, మహబూబ్ నగర్

జాగ్రత్తన్నో.. జీపు టాపుపై ప్రయాణం - భాస్కరాచారి, మహబూబ్ నగర్

గూడంటే గూడూ కాదు.. కేబుల్ వైర్ల మధ్య గూడు కట్టుకున్న పక్షి - సతీష్ పాండు, మెదక్

దాహార్తి తీర్చుకుంటున్న పశువుల కాపరి - సతీష్ పాండు, మెదక్

'ట్రంకు' బండి.. పాత ట్రంకుపెట్టెలో చెల్లిని కూర్చోబెట్టి ఆడిస్తున్న అన్నయ్య - కె.బి. ప్రసాద్, నల్లగొండ

కాలం చెల్లిపోయింది.. నెల్లూరులో రోడ్డు పక్కన పడేసిన పోస్టు బాక్సు - శ్రీనివాసులు, నెల్లూరు

నెల్లూరు ముత్యాలమ్మ జాతరలో భక్తుల ఊరేగింపు - శ్రీనివాసులు, నెల్లూరు

ఎన్నెన్నో వర్ణాలు.. నెల్లూరులో సాయంకాలం ఆకాశం మేఘావృతమై కనిపించిన అద్భుత దృశ్యం - శ్రీనివాసులు, నెల్లూరు

ఆకాశంలో నీలిమబ్చులు.. నెల్లూరులో సంధ్యాసమయంలో కమనీయదృశ్యం - శ్రీనివాసులు, నెల్లూరు

నెల్లూరు కృష్ణపట్నం పోర్టు బంగాళాఖాతంలో కనువిందు చేస్తున్న నౌకలు - వెంకటరమణ, నెల్లూరు

బండిని ఇలా కూడా తీసుకెళ్లొచ్చు.. బైక్ను జేసీబీతో తీసుకెళ్తున్న దృశ్యం - జి.ప్రసాద్, రాజమండ్రి

జర జాగ్రత్త.. తగిన భద్రత లేకుండా పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న దృశ్యం- ఎం. ప్రసాద్, ఒంగోలు

చదువెంత భారమాయె.. తలపై స్కూలు బ్యాగ్ మోసుకుని వెళ్తున్న ఓ విద్యార్థి - మురళీమోహన్, నిజామాబాద్

ఎక్కడికి ఈ పయనం.. గోదావరి నదిలో బోటుపై విహారం - జి.ప్రసాద్, రాజమండ్రి

హైలెస్సా.. గోదావరి నదిలో చేపల వేట - జి.ప్రసాద్, రాజమండ్రి

శ్రీనివాసా గోవిందా.. తిరుమలలో ప్రకృతి రమణీయత - మోహనకృష్ణ, తిరుమల

నింగినేల ఒకటాయె.. సంధ్యాసమయంలో గోదావరిలో కమనీయ దృశ్యం - జి.ప్రసాద్, రాజమండ్రి

ఏమైందిరా కన్నా.. చంటిబిడ్డను ఆడిస్తున్న తల్లి - జి.ప్రసాద్, రాజమండ్రి

స్వాతంత్ర్య వేడుకల్లో గుర్రపు స్వారీ చేస్తున్న యువతి - మాధవరెడ్డి, తిరుపతి

మలాలా స్ఫూర్తితో.. మేమూ మలాలా మాదిరిగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ - భగవాన్, విజయవాడ

ఉల్లి ఘాటు.. విజయవాడలో ఉల్లి కోసం క్యూ - సుబ్రమణ్యం, విజయవాడ

మువ్వన్నెల రెపరెపలు.. జాతీయ జెండాలు చేబూనిన బాలలు - భగవాన్, విజయవాడ

ఆకాశంలో దీవిలా ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం - సుబ్రమణ్యం, విజయవాడ

చిందేయ్, గాల్లో తేలేయ్.. విజయవాడలో నైట్ డ్యాన్స్ - సుబ్రమణ్యం, విజయవాడ

ఉప్పొంగిన దేశభక్తి.. విశాఖపట్నం బీచ్లో జాతీయ జెండా ఎగురవేస్తున్న యువకుడు నవాజ్, వైజాగ్

కుక్క విశ్వాసం.. స్వాతంత్ర్య వేడుకల్లో పుష్పగుచ్చం తీసుకువస్తున్న పోలీస్ డాగ్ - సత్యనారాయణ మూర్తి, విజయనగరం

పచ్చని పొలాల్లో పల్లె ఎంకిలు.. పొలం గట్లపై భోజనం చేస్తున్న కూలీలు - సత్యనారాయణ మూర్తి, విజయనగరం

కేసీర్ పర్యటనకు బందోబస్తుకు వచ్చిన పోలీసులు..రవాణా సదుపాయాలు లేక ఫైరింజన్ ఎక్కారు - వరప్రసాద్, వరంగల్

ఆటో వెనకాల వేళాడుతూ స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు - వరప్రసాద్, వరంగల్