వరుణ్ సందేశ్, సురేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్‌మెయిల్’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత–నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు.
సురేష్ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు.


