
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’ విడుదల తేదిపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. విడుదల తేదిని ప్రకటిస్తూ తాజాగా చిత్రబృందం ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కి నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటీలతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసులు పాల్గొన్నారు.












