రజినీకాంత్.. ప్రేక్షకులను థియేటర్లకు పోటెత్తించిన సినీ హీరోల్లో ఒకరు. ఈయన పేరు వినగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆయన స్టైలిష్ పర్‌ఫార్మెన్స్. 80వ దశకంనాటి నుంచి.. ఇప్పటి చిత్రాల్లో కూడా ఆ మేనరిజం అలాగే కొనసాగుతోంది. అందుకే ఎవర్‌గ్రీన్ స్టైలిష్ స్టార్‌గా ఆయన్ని తమిళ తంబీలు ఆరాధిస్తుంటారు. ఇవాళ ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన అరుదైన స్టిల్స్ మీ కోసం..
సూపర్‌స్టార్ రజనీకాంత్ నేడు 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు
బెంగళూరులో జన్మించిన రజనీ.. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు
బాల్యంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆయన కండక్టర్‌గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు
ఓసారి నాటకంలో ‘దుర్యోధనుడి’ పాత్రలో రజనీని చూసిన అతని స్నేహితుడు రాజ్ బహదూర్ నటనలో శిక్షణ తీసుకోవాలని తెలపడంతో తన సినీ కెరీర్ ప్రారంభమైంది
రజినీకాంత్ 1975లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగళ్' చిత్రంలో చిన్న పాత్రతో తన ప్రస్థానం ప్రారంభించాడు
రజినీకాంత్ నటించిన తొలి సినిమానే మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకోవడం విశేషం
రజనీ కెరీర్ ప్రారంభంలో 20కి పైగా చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ కనిపించారు. అయితే, ‘భైరవి’ సినిమాతో సోలో హీరో అయ్యారు
రజనీకాంత్ కెరీర్‌లో 'భైరవి' చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సినిమా పేరు ముందు ‘సూపర్‌స్టార్’ అని వేశారు
తెలుగులో అంతులేని కథ (1975) చిత్రంతో రజనీ ఎంట్రీ ఇచ్చారు
2002లో 'బాబా' సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు
తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన 'రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్టు'కే చెందుతుందని రజనీ గతంలో బహిరంగ సభలో ప్రకటించారు
'ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్‌స్టార్' పేరుతో సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడిగా రజనీకాంత్‌కు గుర్తింపు ఉంది. ఆరో తరగతిలో ఆయన జీవితంపై పాఠ్యాంశం ఉంది
సుమారు 170 చిత్రాల్లో నటించిన రజనీ పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదా ఫాల్కే అవార్డులు అందుకున్నారు
యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థినిగా తన కాలేజీ మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన లతాను ఇష్టపడి ఆయన వివాహం చేసుకున్నారు
రజనీ,లతాల వివాహం 1981 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది


