
మెగాస్టార్ చిరంజీవి ఇంట దుర్గాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ వేడుకను నిర్వహించారు.

ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు మెగా కుటుంబం అంతా భక్తిభావంతో పాల్గొన్నారు.

దుర్గాష్టమి వేడుకలకు సంబంధించిన వీడియోని మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది

సుస్మిత ప్రస్తుతం షైన్ స్క్రీన్ బ్యానర్ తో కలిసి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మిస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి,నయనతార జంటగా నటిస్తున్నారు.
























