
ప్రముఖ తమిళ నటి విద్యాప్రదీప్ గుడ్‌న్యూస్ చెప్పింది.

త్వరలోనే తను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది.

నీకోసం ఎంత ఎదురుచూస్తున్నానో తెలుసా? నీ రాకతోనే నా జీవితం పరిపూర్ణం కాబోతోంది అంటూ బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

కాగా విద్యాప్రదీప్ యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్, సైంటిస్టు కూడా! ఓ వైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు నటిగా రాణిస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది.

శైవం, పసంగ 2 (తెలుగులో మేము), కళరి, మారి 2, తడమ్, సెల్ఫీ, సెకండ్ షో, ఇన్ఫినిటీ, స్ట్రైకర్, కన్నగి వంటి పలు చిత్రాల్లో నటించింది.

13 ఏళ్ల క్రితం మైకేల్ అనే ఫోటోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకుంది.




