
కూచిపూడి నృత్య రూపకం మనోహరంగా సాగింది. శుక్రవారం రవీంద్ర భారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) వార్షికోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ప్రముఖ నాట్య గురువు దీపికారెడ్డి, ఆమె శిష్య బృందం ప్రదర్శించిన ‘రుక్మిణీ కృష్ణ’ కూచిపూడి నృత్య రూపకం ఆహూతులను సమ్మోహనపర్చింది.
























