
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు.

మిస్ వరల్డ్ 72 ఎడిషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులకు సంప్రదాయబద్దంగా అధికారులు స్వాగతం పలికారు.

హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ 2025లో దాదాపు 120 దేశాల సుందరీమణులు పోటీ పడతున్నారు.

భాగ్యనగరం వేదికగా మే 10 నుంచి 31 వరకు ప్రపంచ సుందరీ పోటీలు జరగనున్నాయి.

మిస్ వరల్డ్ 2025 పోటీల నిర్వహణకు రూ.57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రపంచ సుందరీ పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 10 నుంచి 15 రెట్ల ఆదాయం ఉంటుందని తెలుస్తోంది.

మిస్ వరల్డ్ 2025 విజేతకు ప్రైజ్‌మనీగా రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం.









