విశాఖపట్నం : ఆంధ్ర యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఎథ్నిక్ డే వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి
ఇందులో భాగంగా ఇంజినీరింగ్ కాలేజీ సివిల్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యార్థినులు చీరలు ధరించి ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు
విద్యార్థులు పంచెలు కట్టుకుని తమ సంస్కృతిని చాటుకున్నారు
ఇక్కడ విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు సైతం తమదైన వస్త్రధారణతో ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆకట్టుకున్నారు
సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు


