
మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15, 1861లో మైసూర్ సంస్థానం(ప్రస్తుతం కర్ణాటక)లోని చిక్కబళ్లాపూర్ తాలూకా, ముద్దెనహళ్లి అనే గ్రామంలో జన్మించారు

ఆయన తల్లిదండ్రులు శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ

వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు

1881లో విశ్వేశ్వరయ్య మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ., తరువాత పుణె సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు

పుణెలో ఇంజినీరింగు పూర్తయిన తరువాత తన 23వ ఏట ముంబయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేశారు. తరువాత భారత నీటిపారుదల కమిషన్‌లో చేరారు

అతను దక్కన్ ప్రాంతంలో సమర్థ నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు

నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా నిల్వచేసేలా ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థను రూపొందించారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతపై దృష్టి సారిస్తూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానాన్ని తయారుచేశారు

మొదటిసారిగా వీటిని 1903లో పుణెలోని ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు

1908లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తర్వాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి దాని అభివృద్ధికి కృషి చేశారు. క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు

మైసూర్ సోప్ ఫ్యాక్టరీ

విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి

కృష్టరాజసాగర్ డ్యామ్

శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్

బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం

విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్