కడప కల్చరల్ : దేవతలారా రండి....కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించండి అంటూ వేద పండితులు సకల దేవతలను ఆహ్వానించారు
తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం నుంచి ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి
ఈ సందర్భంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు
అనంతరం అలంకరించిన తిరుచ్చి వాహనంపై స్వామిని ఊరేగించారు
సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ఊయలపై ప్రతిష్ఠించారు. భక్తిగీతాలాపనల మధ్య స్వామికి ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారిని చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో వైభవోపేతంగా ఊరేగించారు


