కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది
ఉగాది పండుగ మరుసటి రోజు పిడకల సమరం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ
ఆంధ్రా నుంచే కాకుండా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది యాత్రికులు కైరుప్పలకు వచ్చి పిడకల సమరాన్ని వీక్షించారు
యాత్రికులతో ఈ గ్రామం కిక్కిరిసిపోయింది
గ్రామంలో కాళికాదేవి, వీరభద్రస్వామి వారు రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో కొట్టుకోవడం, తర్వాత అంత కలిసిపోవడం గ్రామ ఆనవాయితీ


