పూర్వీకుల జాడ దొరికిందోచ్‌! | thummala papireddy faund his Ancestral address | Sakshi
Sakshi News home page

పూర్వీకుల జాడ దొరికిందోచ్‌!

Feb 2 2018 10:36 AM | Updated on Feb 2 2018 10:36 AM

thummala papireddy faund his Ancestral address - Sakshi

పూర్వీకుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న పాపిరెడ్డి తదితరులు

వైఎస్‌ఆర్‌ జిల్లా ,చింతకొమ్మదిన్నె : పూర్వీకుల జాడ(చిరునామా) కోసం కొన్ని సంవత్సరాలుగా గాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డికి ఎట్టకేలకు వారు దొరకడంతో ఆయన ఆనందానికి హద్దులు లేవు. తెలంగాణలోని తమ వంశస్తులతో కలసి గురువారం మండలంలోని బయనపల్లి గ్రామానికి చేరుకున్నారు.

అనంతరం తుమ్మల మల్లారెడ్డి, తుమ్మల బాలమల్లారెడ్డి, తుమ్మల యల్లారెడ్డి అనే వృద్ధులను కలసి పూర్వీకుల గురించి ఆరాతీశారు. నాలుగు తరాల క్రితం తమ తాతలది ఇదే గ్రామమని అని తెలుసుకుని మురిసిపోయారు. తమ పెద్దలు ఇక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ తుమ్మల వంశస్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఆయనతో పాటు తెలంగాణ నుంచి తుమ్మల రాజిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలు గ్రామాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement