పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత | tension in west godavari district | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత

Jan 31 2018 4:28 PM | Updated on Oct 2 2018 3:04 PM

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇచ్చిన గడువు ముగియడంతో పొలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నించారు. అయితే పంట చేతికొచ్చే వరకు గడువు ఇవ్వాలని గ్రామ రైతులు కోరారు. అందుకు అధికారులు గడువు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో అక్కడ ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. అధికారులు పోలీసుల సాయంతో పొలాలను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement