నందమూరు వెంకన్న.. నీవే దిక్కన్నా..

Candidates Visiting Nandamuru Venkanna Temple For Win In Elections In Thadepalli Gudem - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: ఏడుకొండలవాడా.. వేంకటరమణా.. ఆపద్బాంధవా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ నందమూరు వెంకన్నకు నీరాజనాలు అర్పించకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టరు. ఏ పార్టీ అభ్యర్థి అయినా మండలంలోని నందమూరు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామి దర్శనం విజయం కలిగిస్తుందని ఆశావహుల విశ్వాసం. భౌగోళికంగా, వాస్తురీత్యా చూసినా నియోజకవర్గానికి ఈ గ్రామం తూర్పు దిశలో ఉంది.

ఆలయ ప్రాంగణంలో సుమారు 300 వందల ఏళ్ల నాటి గన్నేరు పూల చెట్టు ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే తాళపత్రాల గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఇక్కడి వారే. సత్తుపల్లికి మకాం మార్చినా స్వామిపై విశ్వాసంతో ఖమ్మం జిల్లానుంచి ఏటా ఒక్కసారైనా వచ్చి స్వామిని దర్శించుకునే వారు. అదే ఆనవాయితీని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఇది సెంటిమెంటుగా మారింది. ప్రచార పర్వంలో అభ్యర్థులు ఈ ఆలయానికి క్యూ కట్టడం విశేషం.   

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top