మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం |  aisf national committee meetings starts in ku university | Sakshi
Sakshi News home page

మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం

Jan 7 2018 12:49 PM | Updated on Jan 7 2018 12:49 PM

 aisf national committee meetings starts in ku university - Sakshi

సాక్షి, కేయూ క్యాంపస్‌: మతోన్మాద శక్తులపై, విద్యారంగ సమస్యలపై పోరాడాలని కేరళ మాజీ మంత్రి, ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భినయ్‌ విశ్వం పిలుపునిచ్చారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) జాతీయ సమితి సమావేశాలు కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్‌ విభాగంలోని సెమినార్‌హాల్‌లో శనివారం ప్రారంభమయ్యా యి. ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రీ అధ్యక్షత వహించిన ఈ సభలో బినయ్‌ విశ్వం ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో మతోన్మాద శక్తుల దాడులు పెరిగిపోయాయని తెలిపారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన యూ నివర్సిటీల్లో కుల,మత రాజకీయాలు తగదన్నారు.

దేశంలో అక్కడక్కడ బాబాలు, దొంగస్వాములు ఆశ్రమ విద్యాలయాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నా మోదీ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా ఎఫ్‌డీఐ పేరుతో విదేశీ యూనివర్సిటీలను తీసుకొచ్చే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని ఐసీహెచ్‌ఆర్‌ చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలు కలిగిన హిస్టరీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సుదర్శన్‌రావును నియమించుకున్నారని ఆరోపించారు. 1992 డిసెంబర్‌ 6న హిందుత్వ మతోన్మాదులు బాబ్రీ మసీద్‌ను కూల్చివేశారన్నారు. శాస్త్రీయ విద్యావిధానం అవసరం న్యూ ఇండియా న్యూ ఎడ్యూకేషన్‌ తో దేశం ముందుకెళ్లాలంటే పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను ఏఐఎస్‌ఎఫ్‌ జాతీ య సమితి సమావేశాల్లో చర్చించి పక్కా ప్రణా ళికతో మిలిటెంట్‌ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఏఐ ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలనుంచి తప్పుకునేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఢిల్లీకి చెందిన ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రహీలపర్వీన్‌ మాట్లాడారు. జాతీయ సమితి సమావేశాల్లో భవిష్యత్‌ పోరాటాలు చేసేందుకు ఉపక్రమించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వేణు, శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గసభ్యులు స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, రంగన్న, పంజాబ్‌ రాష్ట్రకార్యదర్శి విక్కి మహేశ్వర్, రాజస్తాన్‌ రాష్ట్ర కార్యదర్శి నితిన్, రాష్ట్ర బాధ్యులు రంజిత్, అశోక్‌స్టాలిన్, రాజారాం, భానుప్రసాద్‌తో పాటు జిల్లా అధ్యక్షుడు కె నరేశ్, గడ్డం నాగార్జున తది తరులు పాల్గొన్నారు. కాగా ప్రారంభ సూచికగా శ్వేత అరుణ పతాకాన్ని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు ఆవిష్కరించారు. ఈ నెల 7న సాయంత్రం ఈ సమావేశాలు ముగియబోతున్నాయి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement