నిజమైన దానం

నిజమైన దానం


జ్యోతిర్మయం


చాలాసార్లు మెహర్‌బాబా నిస్వార్థ సేవ గురించి, ఇతరులకు సేవ చెయ్యటం గురించి, తన సుఖం చూసుకోకుండా, ఇతరులను సుఖపెట్టడం గురించి చెబుతుండేవారు. అయితే, ఇతరులకు సహాయం చెయ్యడం అనేది అంత తేలికయిన విషయం కాదు. ఏవిధంగా తెలిసి ఉండాలో నీకు తెలిసి ఉండాలి.


 గుళ్లదగ్గర అడుక్కునే వాళ్లు కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ఏమైనా దానం ఇద్దామని నీకు అనిపించ వచ్చు. కాని ఇచ్చేముందు ఎవరికి ఇవ్వాలో తెలి యాలి. దానం ఇవ్వటం అంటే జేబులో చెయ్యి పెట్టి డబ్బు తీసి అడుక్కునేవానికి ఇవ్వడం మాత్రమే అను కుంటే పొరపాటు. అడుక్కునేవానికి అలా ఇచ్చావే అనుకుందాం. అప్పుడు నీవు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగి ఇంటికి వెళ్లి వాళ్లను కొడితే అప్పుడు నీ దానం ఎవరికి ఉపయోగపడింది? నీవు ఎవరికి సహాయం చేసినట్టు?


 అందుకనే, బీదలకు సహాయం చేసేటప్పుడు, ఆ బీదలు నిజంగా బీదలు అవునో కాదో ముందు నిర్ధారించుకోవల సిందిగా మెహర్‌బాబా తన శిష్యు లకు గట్టిగా చెప్పేవారు. వీధిపక్క జోలె పట్టుకుని చేతులు చాచిన ప్రతివాడిని బీదవాడని అనుకోవడా నికి వీల్లేదు. ఒకప్పుడు బాగా బతికి, తరువాత చితికి పోయిన కుటుంబాలు ఉంటాయి. వారు కటిక బీదరి కంలోనూ, ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. వారు బయ టకు వచ్చి అడుక్కోలేరు. అలాంటివారే సహాయం పొందటానికి నిజంగా అర్హులు. 


  అలాంటివారికి కూడా మనం ఆలోచించి సహాయం చెయ్యాలి. గుడ్డిగా చెయ్యకూడదు. ఆ చేసే సహాయం ఎలా చెయ్యాలి అంటే, ఆ సహాయం వాళ్లని వాళ్ల కష్టాల్లో సమయానికి ఆదుకోవాలి.


 దానం చేసిన ప్రతిసారీ నేను సహాయం చేశాను, నేనో మంచిపని చేశాను అని నీకు అనిపించి నీలో గర్వం, అహంకారం పెరిగితే, అది నీకు మంచి చెయ్యదు. అహంకారంతో ఎప్పుడైతే నీవు సహాయం చేస్తావో, అప్పుడే సహాయం పొందేవాని అహంకారం కూడా నీ అహంకారానికి స్పందిస్తుంది. దానం తీసు కున్నవాడు, దానం ఇచ్చినవానికి రుణపడిపోయానని అనుకుంటాడు. ఆ భారం అతడిని కుంగదీస్తుంది. ఫలితంగా, అతడు దానం ఇచ్చినవాడి నుంచి దూ రంగా జరుగుతాడు. నీవు ఎవరికి సాయం చేసినా, అది నీకు నీవు చేసుకున్నట్లుగా ఎప్పుడనుకుంటావో, అప్పుడు అది నిజమైన సాయం అవుతుంది. గొప్ప కోసం, పేరుకోసం చేసేది దానం అనిపించుకోదు.


 నీ కుడిచేయి చేసిన సాయం, నీ ఎడం చేయికి తెలియకూడదు. నీవు చేసిన దానం అప్పుడే మరిచి పోవాలి. సహాయం పొందినవాడు నిన్ను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకు కృతజ్ఞుడిగా ఉండాలి అను కుంటే, నీకు నిరాశ మిగులుతుంది. అంతిమంగా మెహర్‌బాబా చెప్పేది ఏమంటే, చేసేది నేను కాదు. భగవంతుడు నా చేత ఈ సాయం చేయిస్తున్నాడని నీవు భావించినప్పుడు, అది ఉత్తమోత్తమంగా సహా యం చేయడం అవుతుంది.    


 - దీవి సుబ్బారావు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top