అందుబాటులో బిందు సేద్యం పరికరాలు | Drip irrigation equipment in available | Sakshi
Sakshi News home page

అందుబాటులో బిందు సేద్యం పరికరాలు

Sep 22 2014 1:15 AM | Updated on Sep 2 2017 1:44 PM

పంటలు పండించుకోవడానికి నీటి సరఫరా కోసం బిందు సేద్యం(డ్రిప్) పరికరాలు...

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో వివిధ రకాల పంటలు పండించుకోవడానికి నీటి సరఫరా కోసం బిందు సేద్యం(డ్రిప్) పరికరాలు అందుబాటులో ఉన్నాయని బిందు సేద్యం పథకం సంచాలకులు నర్సింగ్ తెలిపారు. జిల్లాకు భౌతిక లక్ష్యం 2,500 హెక్టార్లకు పైపులు, నాజిల్‌లు మంజూరైనట్లు తెలిపారు.

 పత్తి, పసుపు, మిర్చి, సోయా, మొక్కజొన్న పంటలకు రెండు వేల హెక్టార్లకు, కూరగాయల సాగుకు 500 హెక్టార్లకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి వద్ద దరఖాస్తులు లభిస్తాయని, వాటిని పూర్తి చేసి అక్కడే గానీ, ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో గానీ అందించవచ్చని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

 దరఖాస్తు చేసుకునే విధానం
 టైటిల్ బుక్ జిరాక్స్‌పై తహశీల్దార్ లేదా డెప్యూటీ తహశీల్దార్ సంతకం ఉండాలి. లేదా మీ సేవ ద్వారా తీసుకున్న 1బీ ఫారం జతపర్చాలి.
 కౌలు రైతులు రిజిస్ట్రార్ లీజు డాక్యుమెంటు ఐదేళ్ల వరకు తీసుకున్నది జతపర్చాలి.
 కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు దానికి సంబంధించిన  రిజిస్ట్రేషన్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకంతోపాటు ఈసీ జతచేయాలి.
 ఆధార్, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఏదేని ఒకటి జతచేయాలి.
 ఎస్సీ, ఎస్టీ రైతులు సంబంధిత అధికారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ జతపర్చాలి.
 దరఖాస్తు ఫారంపై ఇటీవల కాలంలో దిగిన పాస్‌పోర్టుసైజ్ ఫొటో అతికించాలి.
 ఒకసారి రాయితీ పొందిన రైతులకు పదేళ్ల వరకు ఈ పథకం వర్తించదు.

 రాయితీ వివరాలు..
 ఐదెకరాల్లోపు విస్తీర్ణం కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.లక్షకు మించకుండా వంద శాతం రాయితీ ఇస్తారు.
 చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్షకు మించకుండా 90శాతం రాయితీ లభిస్తుంది.
 ఐదు నుంచి పదెకరాల భూమి ఉన్న రైతులకు రూ.లక్షకు మించకుండా 75శాతం సబ్సిడీ వర్తిస్తుంది.
 పదెకరాల కంటే ఎక్కువగా ఉంటే రూ.లక్షకు మించకుండా 60శాతం రాయితీ అందిస్తారు.
 ధర రూ.లక్షకు పైగా అయితే 12ఎకరాల వరకు బిందు సేద్యం ఏర్పాటు చేసుకునే రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారు.

 తుంపర్ల(స్ప్రింక్లర్స్) సేద్య పథక ం
 తుంపర్ల సేద్యం ద్వారా సాగు చేసుకోవడానికి జిల్లాలోని 52 మండలాలకు గాను ప్రతి మండలానికి 24 చొప్పున తుంపర్ల సేద్య పరికరాలు అందజేస్తాం. బిందు సేద్య పరికరాల దరఖా స్తు నమూనా వలనే దరఖాస్తుతో జిరాక్స్ పత్రాలు జతపరిచి ఏంపిడీవో లేదా మండల వ్యవసాయ అధికారికి అందించాలి. 8 రకాల కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

 రాయితీ వివరాలు
 పరికరాల ఖరీదు రూ.18,417.. ప్రభుత్వ రాయితీ 50 శాతం రూ.9.208 చెల్లిస్తుంది. రైతు రూ.9.209 భరించాలి.
 ఒక సెట్‌కు  25 హెచ్‌డీఈపీ పైపులు, 5 నాజిల్స్, 5 జీఐ పైపుల(రైజర్స్)తోపాటు ఇతర సామగ్రి అందజేస్తారు.
 గతంలో లబ్ధి పొందిన రైతులకు పదేళ్ల వరకు అవకాశం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement