శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది! | S.Sreesanth to marry on December 12 | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది!

Nov 18 2013 10:09 PM | Updated on Sep 2 2017 12:44 AM

శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది!

శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ పెళ్లి కుదిరింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ పెళ్లి కుదిరింది. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12 తేదిన పెళ్లి జరుగుతుంది అని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. 
 
గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచినట్టు తెలిసింది. 
 
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ సెప్టెంబర్ లో నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రస్తుతం శ్రీశాంత్ బెయిల్ పై ఉన్నారు. శ్రీశాంత్ పై మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైమ్ యాక్ట్) కింద కేసు నమోదైంది. ఈ కేసు డిసెంబర్ 18 తేదిన విచారణకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement