కన్నీటితో వెలుతున్నా.. ఓ తల్లి ఆవేదన | jail officers not allow the Accused mother | Sakshi
Sakshi News home page

కన్నీటితో వెలుతున్నా.. ఓ తల్లి ఆవేదన

Apr 18 2017 10:42 PM | Updated on Sep 5 2017 9:05 AM

జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెలుతున్నానని మురుగన్‌ తల్లి చోమని అమ్మాల్‌ వాపోయారు.

వేలూరు: జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెలుతున్నానని మురుగన్‌ తల్లి చోమని అమ్మాల్‌ వాపోయారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్‌ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు పురుషుల జైలులో, మురుగన్‌ భార్య నళిని మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మురుగన్‌ తల్లి చోమని అమ్మాల్‌ శ్రీలంక నుంచి ఒక నెల టూరిస్ట్‌ విసాతో తమిళనాడుకు వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలూరు సెంట్రల్‌ జైలుకు వెళ్లి కుమారుడు మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంది.

అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్‌ను చూడాలని ధరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్‌ జైలులో సెల్‌ఫోన్‌ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేదించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళిని చూసేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్‌ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement