జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత? | Zen Cinemax 2+ With SOS Calling, 5-Megapixel Camera Launched at Rs. 3,777 | Sakshi
Sakshi News home page

జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత?

Oct 28 2016 2:09 PM | Updated on Sep 4 2017 6:35 PM

జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత?

జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత?

భారత మొబైల్ తయారీదారు జెన్ మొబైల్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. సినిమాక్స్ పోర్ట్ఫోలియో లో సినిమాక్స్ 2 ప్లస్ పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోను జోడించింది. దీని ధరను రూ. 3,777 గా నిర్ణయించింది.

న్యూడిల్లీ: భారత మొబైల్ తయారీదారు జెన్ మొబైల్స్  తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది.  సినిమాక్స్ పోర్ట్ఫోలియో లో సినిమాక్స్   2 ప్లస్ పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోను  జోడించింది. దీని ధరను  రూ.  3,777 గా నిర్ణయించింది.  ఎస్ ఓ ఎస్ కాలింగ్ తో అత్యవసరం సమమయంలో అయిదు  నెంబర్లకు  లొకేషన్ డీటెయిల్స్ అందింజే ఫీచర్ తో దీన్ని లాంచ్ చేసింది.   ఇది ప్రత్యేకంగా ఇ-కామర్స్ వెబ్సైట్ షాప్ క్లూస్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.
జెన్ మొబైల్  పరిధిని విస్తరించడం సంతోషంగా ఉందని జెన్ సినిమాక్స్ 2 ప్లస్  ప్రారంభంపై   జెన్ మొబైల్స్ సీఈఓ  సంజయ్ కాలిరోనా వ్యాఖ్యానించారు. షాప్ క్లూస్ తో భాగస్వామ్యం ద్వారా మరింత వినియోగదారులను సాధించనున్నట్టుతెలిపారు. ఇది కచ్చితంగా విజయవంతమవుతందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  
 
జెన్  సినిమాక్స్ 2 ప్లస్  ఫీచర్లు
డ్యూయల్ సిమ్ 5.1 లాలిపాప్
5.5ఇంచెస్ డిస్ ప్లే
1.3 క్వాడ్ కోర్  ప్రాసెసర్
480x854 పిక్సెల్ రిజల్యూషన్
5 ఎంపీ రియల్ కెమెరా ఫ్లాష్  విత్  ఆటో ఫోకస్
3.2  ఎంపీఫ్రంట్ కెమెరా
1జీబీ  ర్యామ్, 8జీబీ స్టోరేజ్
32జీబీ ఎక్స్ పాండబుల్ మొమర
2900ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement