లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు | YSR Jayanti celebrations held in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

Jul 22 2015 2:26 AM | Updated on Jul 7 2018 2:56 PM

లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు - Sakshi

లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను ఈ నెల 19న లండన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యునెటైడ్ కింగ్‌డమ్,

హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను ఈ నెల 19న లండన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యునెటైడ్ కింగ్‌డమ్, యూరప్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 150 మందికిపైగా ప్రవాసాంధ్రులు, వైఎస్సార్‌కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ బాల్యం, రాజకీయ ప్రస్థానం, ప్రజాజీవితంతో కూడిన వీడియోను నిర్వాహకులు ప్రదర్శించారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ , కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అట్లాంటా ఎన్నారై విభాగం కన్వీనర్ గురవారెడ్డి తదితరులు టెలిఫోన్ లైన్‌ద్వారా.. వైఎస్సార్ అభిమానులకు అభినందనలు తెలిపి ఉత్తేజపరిచారు. తెలుగు ప్రజలందర్నీ కుల, మత, ప్రాంతీయబేధాలు లేకుండా ప్రేమించి వైఎస్సార్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

వీడియో ద్వారా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ సందేశాన్ని వినిపి ంచారు.  ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యూకే, యూరప్ విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తున్న సందీప్ వంగల, కిరణ్, అబ్బాయ్ చౌదరి, పీసీ రావు, ప్రదీప్‌రెడ్డి, వాసు, శివ, సతీష్ తదిరులు తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. వైఎస్ ఆశయాల సాధన వైఎస్ జగన్‌తో సాధ్యమనే సందేశాన్ని వినిపించారు. బ్రిటన్‌లో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యాచరణతోపాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు కోరల్లో చిక్కుకున్న పల్లెల్లో వైఎస్సార్‌సీపీ ఎన్నారై శాఖ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement