అగర్వాల్‌ మృతికి వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Mohan Reddy expressed grief over the death of Ramesh Chandra Agarwal | Sakshi
Sakshi News home page

అగర్వాల్‌ మృతికి వైఎస్‌ జగన్‌ సంతాపం

Apr 13 2017 4:11 AM | Updated on Jul 25 2018 4:42 PM

అగర్వాల్‌ మృతికి వైఎస్‌ జగన్‌ సంతాపం - Sakshi

అగర్వాల్‌ మృతికి వైఎస్‌ జగన్‌ సంతాపం

దైనిక్‌ భాస్కర్ గ్రూపు చైర్మన్‌ రమేశ్‌ చంద్ర అగర్వాల్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం ప్రకటించారు.

‘దైనిక్‌ భాస్కర్‌’ రమేశ్‌ అగర్వాల్‌ అస్తమయం
అహ్మదాబాద్‌: దేశంలో ప్రఖ్యాతిగాంచిన దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ చైర్మన్‌ రమేశ్‌ చంద్ర అగర్వాల్‌(73) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం అహ్మదా బాద్‌కు విమానంలో చేరుకున్న ఆయనకు ఎయిర్‌పో ర్టులోనే గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు స్పష్టంచేశారు.

గురువారం సాయంత్రం భోపాల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారని దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు చెప్పారు. అగర్వాల్‌ మరణవార్త తెలిసి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆస్పత్రిలో ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సైతం సంతాపం తెలిపారు. అగర్వాల్‌ మృతివార్త తెలిసి పత్రికావర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

తండ్రితో కలసి భోపాల్‌కు: 1944 నవంబర్‌ 30న ఝాన్సీలో జన్మించిన అగర్వాల్‌.. తండ్రి ద్వారకప్రసాద్‌ అగర్వాల్‌తో కలసి భోపాల్‌కు తరలివచ్చారు. 1958లో దైనిక్‌ భాస్కర్‌ వార్తాపత్రికను ప్రారంభించారు. అగర్వాల్‌ నేతృత్వంలో దైనిక్‌భాస్కర్‌ గ్రూప్‌ 14 రాష్ట్రాల్లో 62 ఎడిషన్లను పబ్లిష్‌ చేస్తోంది. సర్క్యులే షన్‌పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వార్తాపత్రికగా రికార్డుల కెక్కింది.   

దైనిక్‌ భాస్కర్‌ చైర్మన్‌ మృతికి జగన్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: దైనిక్‌ భాస్కర్‌ గ్రూపు చైర్మన్‌ రమేష్‌ చంద్ర అగర్వాల్‌ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అగర్వాల్‌ కుటుంబీకులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement