అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు | women's protests at salur town due to onion price hike | Sakshi
Sakshi News home page

అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు

Aug 25 2015 11:55 AM | Updated on Sep 3 2017 8:07 AM

అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు

అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు

అమ్మా.. ఉల్లి తల్లమ్మా.. మామీద కనికరం చూపమ్మా...అంటూ మహిళలు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు.

విజయనగరం : అమ్మా.. ఉల్లి తల్లమ్మా.. మామీద కనికరం చూపమ్మా...అంటూ మహిళలు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. సాలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా ఈ విధంగా తమ ఆందోళన తెలిపారు.

ప్రభుత్వాల చేతగానితనం వల్లే ఉల్లి ధరలు ఆకాశనంటాయని వారు ఆరోపించారు.  ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళలు గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం ఉల్లి గడ్డల ధరలను నియంత్రించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని మహిళలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement