మక్కా మృతుల్లో మరో హైదరాబాదీ | women from hyderabad killed in haj stampede | Sakshi
Sakshi News home page

మక్కా మృతుల్లో మరో హైదరాబాదీ

Sep 25 2015 10:03 AM | Updated on Sep 4 2018 4:52 PM

హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినాలో గురువారం జరిగిన తొక్కిసలాటలో నగరానికి చెందిన మరో మహిళ కూడా ఉన్నట్టు సమాచారం.

చాంద్రాయణగుట్ట : హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినాలో గురువారం జరిగిన తొక్కిసలాటలో నగరానికి చెందిన మరో మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. చాంద్రాయణగుట్ట గాజీ మిల్లత్ కాలనీకి చెందిన ఎండీ గౌస్ భార్య సభాత్ తస్లీమ్ (50) తొక్కిసలాట ఘటనలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఎల్బీనగర్‌కు చెందిన బీబీ జాన్(62) కూడా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.


మక్కా ఘటనలో 14 మంది భారతీయులు మరణించారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.  మరో 13 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. గురువారం జరిగిన తొక్కిసలాటలో మొత్తం 717 మంది మరణించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement