breaking news
taslem
-
భారత్‌లో విధ్వంసానికి ఐసిస్ నిధులు
తిరువనంతపురం: గల్ఫ్ దేశాలను గడగడలాడించి ప్రాబల్యం కోల్పోయిన ఐసిస్ భారత్‌లో పాగా వేసేదిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లుస్తోంది. ఈ పథకంలో భాగంగా భారతీయులకు భారీగా డబ్బును ఎరగా వేస్తోంది. కేరళ నుంచి పారిపోయి ఐసిస్‌లో చేరిన కేరళ యువతకు పెద్ద మొత్తంలో నిధులను అందిస్తోంది. తద్వారా భారీ విధ్యంసానికి ప్రణాళికలు రచిస్తోంది. సిరియా, ఇరాక్‌ల్లో ప్రాభల్యం కోల్పోయిన ఐసిస్ భారత్‌లో పాగా వేయడానికి కేరళను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా కేరళ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరిన సానుభూతిపరులకు పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. దీనికి హవాలాను ప్రధాన మార్గంగా ఎంచుకుంది. అయితే ఐసిస్ ప్రణాళికలను కేరళ పోలీసులు భగ్నం చేశారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్‌తో ఐసిస్ భారీ విద్వంసానికి నిధులు సమకూరుస్తోందన్న సమాచారం అందుకున్న కేరళ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదును హవాలా రూపంలో పీఎఫ్ఐ సభ్యుడు తస్లీంకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచే ఐసిస్ సానుభూతిపరులకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
మక్కా మృతుల్లో మరో హైదరాబాదీ
చాంద్రాయణగుట్ట : హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినాలో గురువారం జరిగిన తొక్కిసలాటలో నగరానికి చెందిన మరో మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. చాంద్రాయణగుట్ట గాజీ మిల్లత్ కాలనీకి చెందిన ఎండీ గౌస్ భార్య సభాత్ తస్లీమ్ (50) తొక్కిసలాట ఘటనలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఎల్బీనగర్కు చెందిన బీబీ జాన్(62) కూడా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మక్కా ఘటనలో 14 మంది భారతీయులు మరణించారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. గురువారం జరిగిన తొక్కిసలాటలో మొత్తం 717 మంది మరణించిన విషయం తెలిసిందే.