కుక్కల్లో కూడా అంతేనట..! | Sakshi
Sakshi News home page

కుక్కల్లో కూడా అంతేనట..!

Published Wed, Dec 21 2016 3:33 PM

కుక్కల్లో కూడా అంతేనట..! - Sakshi

వాషింగ్టన్: అధిక ఒత్తిడి కారణంగా మానవులలాగానే  కుక్కలు కూడా  ప్రభావితమవుతాయట. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఫలితంగా వాటి బొచ్చుకూడా  ముందుగానే  తెల్లబడిపోతుందట.  తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని  కనుగొన్నారు.   ఎక్కువ స్ట్రెస్ మూలంగా కుక్కల్లో కూడా ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ను  గుర్తించినట్టు కొలరాడో పరిశోధకులు చెబుతున్నారు.   

కొలరాడో లో పరిశోధకులు 1-4 వయస్సున్న 400 ముదురు రంగు కుక్కలపై ఈ పరిశోధన జరిపారు.  వాటి నమూనాలు ఛాయా చిత్రాలను సేకరించారు. మరోవైపు వాటి ఆరోగ్యం,  ప్రవర్తనాతీరుపై  అడిగి తెలుసుకునేందుకు వాటి యాజయానులకు ఒక  ప్రశ్నాపత్రాన్ని అందించారు.  పరిశోధన తరువాత కూడా ఫోటోలను పరిశీలించారు. దీంతో  ముందు అస్పలు తెల్లగా లేని కుక్కల బొచ్చు  పూర్తిగా తెల్లగా మారిపోయినట్టు గుర్తించారు. కుక్కల ఆరోగ్యం కూడా తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం చూపే అవకాశాలున్నట్టు తేల్చారు.
వ్యాకులత, మానసిక  ఆందోళన అధిక స్థాయిలో ఉన్న కుక్కల్లో  బూడిద జుట్టును ఉంటుందని తెలివపారు.  పెద్ద శబ్దాలచేయడం, ఏదో తెలియని  భయంతో ఉన్నట్టుగా ప్రవర్తించడం దీనికి సంకేతాలని తెలిపారు.  మానవులు భయపడినట్టుగానే  ఇవికూడా ప్రవర్తిస్తాయని , ఈ ప్రవర్తనను గుర్తించాలని సూచించారు.   ముఖ్యంగా 4 ఏళ్లలోపు కుక్కల్లో కనిపించే 'గ్రే మజిల్' ఆందోళన లేదా ఇతర భయం సంబంధితమైన ఆందోళనకు పరిస్థితులు హెచ్చరిక సంకేతం కావచ్చని పరిశోధకులు తెలిపారు.అంతేకాదు మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల్లోనే ఒత్తిడి ఎక్కువ అని కూడా తేల్చారు. మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల బొచ్చు చాలా తొందరగా తెల్లబడుతునట్టు  ఈ అధ్యయనం లో తేలింది.
ఈ పరిశోధనా పత్రాన్ని అప్లైడ్ యానిమల్   బిహేవియర్ సైన్స్ జర్నలో ప్రచురించారు. ''క్వైట్ స్ట్రైకింగ్" గా ఈ రిపోర్టును అభివవర్ణించబడింది.  
 

Advertisement
Advertisement