breaking news
gray hair: study
-
నెరిసిన జుట్టుకి సహజమైన మెరుపు..
ఇప్పుడు తల నెరిసిపోవడానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. దాంతో ముప్పయిల వయసు దాటక ముందే తలకు రంగు వేసుకోవడం కామన్ అయిపోయింది. పెరిగిన రూట్స్ కారణంగా తరచుగా సెలూన్‌కి వెళ్లడం కష్టమవుతూ ఉంటుంది. అయితే, సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఈ డివైస్ చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఉంటే సెలూన్లో మాదిరి టచ్–అప్ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.ఇది ఇన్స్టంట్ హెయిర్ కలర్ స్ప్రే. ఇది కేవలం నెరిసిన జుట్టునే కాకుండా, పల్చబడిన జుట్టును కూడా కవర్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎయిర్బ్రష్లాంటి ఫైన్ స్ప్రే అప్లికేషన్‌ను అందిస్తుంది, ఇది జుట్టు రంగుతో కలిసిపోయి సహజంగా కనిపిస్తుంది. అలాగే దీనితో జుట్టు జిడ్డుగా, గట్టిగా లేదా నిర్జీవంగా మారకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాదు, దీన్ని ఒక్కసారి అప్లై చేసుకుంటే షాంపూ చేసే వరకు నిశ్చింతగా ఉండొచ్చు. వేగంగా రూట్స్ కవర్ చేయడానికి ఇది మార్కెట్లో ఉన్న ఉత్తమ మార్గాలలో ఒకటి. బిజీ లైఫ్స్టయిల్లో ఉన్నవారికి, ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపించాలనుకునే వారికి ఈ రూట్ టచ్ అప్ కిట్ తప్పక ఉండవలసిన బ్యూటీ ప్రొడక్ట్! ఈ గాడ్జెట్‌కి సంబంధించిన కిట్‌లో బ్లాక్‌తో పాటు చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయి.నూగు మాయం!అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించడానికి, వాటిని బలహీనపరచి, చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలామంది ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా పచ్చి బొప్పాయి గుజ్జు తీసుకుని, దానికి కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న భాగాల్లో రాసుకుని, సుమారు 15 నిమిషాలు మసాజ్ చేయాలి. అనంతరం మరో 15 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగాలి. ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు చేసినట్లయితే, నెమ్మదిగా వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. నిజానికి పచ్చి బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్ వెంట్రుకల కుదుళ్లను బలహీనపరచడానికి సహాయపడుతుంది. అవాంఛిత రోమాలతో బాధపడేవారికి ఈ చిట్కా మంచి ఫలితాలను అందిస్తుంది. (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!) -
తెల్లజుట్టు సమస్యా.. ఇలా చేయండి!
ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. బ్లాక్ టీ తెల్లజుట్టు నివారణలో బ్లాక్ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. సేజ్ ఆకులు ఎండిన సేజ్(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు. హెన్నా తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు. ఉసిరి నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్, గ్రైండ్ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె, అల్లం కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేడి చేసి కాసేపు మరగబెట్టాలి. ఒక రాత్రంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి... దీనికి కాసింత తేనె కలిపి జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. మెరుగైన ఫలితం కోసం ఉసిరితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. -
కుక్కల్లో కూడా అంతేనట..!
వాషింగ్టన్: అధిక ఒత్తిడి కారణంగా మానవులలాగానే కుక్కలు కూడా ప్రభావితమవుతాయట. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఫలితంగా వాటి బొచ్చుకూడా ముందుగానే తెల్లబడిపోతుందట. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఎక్కువ స్ట్రెస్ మూలంగా కుక్కల్లో కూడా ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ను గుర్తించినట్టు కొలరాడో పరిశోధకులు చెబుతున్నారు. కొలరాడో లో పరిశోధకులు 1-4 వయస్సున్న 400 ముదురు రంగు కుక్కలపై ఈ పరిశోధన జరిపారు. వాటి నమూనాలు ఛాయా చిత్రాలను సేకరించారు. మరోవైపు వాటి ఆరోగ్యం, ప్రవర్తనాతీరుపై అడిగి తెలుసుకునేందుకు వాటి యాజయానులకు ఒక ప్రశ్నాపత్రాన్ని అందించారు. పరిశోధన తరువాత కూడా ఫోటోలను పరిశీలించారు. దీంతో ముందు అస్పలు తెల్లగా లేని కుక్కల బొచ్చు పూర్తిగా తెల్లగా మారిపోయినట్టు గుర్తించారు. కుక్కల ఆరోగ్యం కూడా తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం చూపే అవకాశాలున్నట్టు తేల్చారు. వ్యాకులత, మానసిక ఆందోళన అధిక స్థాయిలో ఉన్న కుక్కల్లో బూడిద జుట్టును ఉంటుందని తెలివపారు. పెద్ద శబ్దాలచేయడం, ఏదో తెలియని భయంతో ఉన్నట్టుగా ప్రవర్తించడం దీనికి సంకేతాలని తెలిపారు. మానవులు భయపడినట్టుగానే ఇవికూడా ప్రవర్తిస్తాయని , ఈ ప్రవర్తనను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా 4 ఏళ్లలోపు కుక్కల్లో కనిపించే 'గ్రే మజిల్' ఆందోళన లేదా ఇతర భయం సంబంధితమైన ఆందోళనకు పరిస్థితులు హెచ్చరిక సంకేతం కావచ్చని పరిశోధకులు తెలిపారు.అంతేకాదు మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల్లోనే ఒత్తిడి ఎక్కువ అని కూడా తేల్చారు. మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల బొచ్చు చాలా తొందరగా తెల్లబడుతునట్టు ఈ అధ్యయనం లో తేలింది. ఈ పరిశోధనా పత్రాన్ని అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నలో ప్రచురించారు. ''క్వైట్ స్ట్రైకింగ్" గా ఈ రిపోర్టును అభివవర్ణించబడింది.


