ఇప్పుడు తల నెరిసిపోవడానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. దాంతో ముప్పయిల వయసు దాటక ముందే తలకు రంగు వేసుకోవడం కామన్ అయిపోయింది. పెరిగిన రూట్స్ కారణంగా తరచుగా సెలూన్‌కి వెళ్లడం కష్టమవుతూ ఉంటుంది. అయితే, సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఈ డివైస్ చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఉంటే సెలూన్‌లో మాదిరి టచ్–అప్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.
ఇది ఇన్‌స్టంట్ హెయిర్ కలర్ స్ప్రే. ఇది కేవలం నెరిసిన జుట్టునే కాకుండా, పల్చబడిన జుట్టును కూడా కవర్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎయిర్‌బ్రష్‌లాంటి ఫైన్ స్ప్రే అప్లికేషన్‌ను అందిస్తుంది, ఇది జుట్టు రంగుతో కలిసిపోయి సహజంగా కనిపిస్తుంది. అలాగే దీనితో జుట్టు జిడ్డుగా, గట్టిగా లేదా నిర్జీవంగా మారకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుంది.
అంతేకాదు, దీన్ని ఒక్కసారి అప్లై చేసుకుంటే షాంపూ చేసే వరకు నిశ్చింతగా ఉండొచ్చు. వేగంగా రూట్స్ కవర్ చేయడానికి ఇది మార్కెట్లో ఉన్న ఉత్తమ మార్గాలలో ఒకటి. బిజీ లైఫ్‌స్టయిల్‌లో ఉన్నవారికి, ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపించాలనుకునే వారికి ఈ రూట్ టచ్ అప్ కిట్ తప్పక ఉండవలసిన బ్యూటీ ప్రొడక్ట్! ఈ గాడ్జెట్‌కి సంబంధించిన కిట్‌లో బ్లాక్‌తో పాటు చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయి.
నూగు మాయం!
అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించడానికి, వాటిని బలహీనపరచి, చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలామంది ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా పచ్చి బొప్పాయి గుజ్జు తీసుకుని, దానికి కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న భాగాల్లో రాసుకుని, సుమారు 15 నిమిషాలు మసాజ్ చేయాలి. అనంతరం మరో 15 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగాలి.
ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు చేసినట్లయితే, నెమ్మదిగా వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. నిజానికి పచ్చి బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్ వెంట్రుకల కుదుళ్లను బలహీనపరచడానికి సహాయపడుతుంది. అవాంఛిత రోమాలతో బాధపడేవారికి ఈ చిట్కా మంచి ఫలితాలను అందిస్తుంది.
(చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!)


