ఆ ముప్పావు గంటలో ఏం జరిగింది? | what happend in 45 minits | Sakshi
Sakshi News home page

ఆ ముప్పావు గంటలో ఏం జరిగింది?

Aug 5 2015 10:57 PM | Updated on Sep 3 2017 6:50 AM

ఆ ముప్పావు గంటలో ఏం జరిగింది?

ఆ ముప్పావు గంటలో ఏం జరిగింది?

సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మారేడుపల్లి(హైదరాబాద్): సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో బన్నప్ప కుటుంబ సభ్యులతో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి 9.15 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తున్నారు.

దాడి వెనుక పాతనేరగాళ్ల హస్తం?
బస్తీలో ఉన్న బన్నప్ప కుటుంబ సభ్యుల వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. బన్నప్ప మృతి చెందడంతో కుటుంబ సభ్యులను రెచ్చగొట్టడంతోపాటు పోలీస్‌స్టేషన్ లోపల, బయట దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దాడి వెనుక మారేడుపల్లికి చెందిన పాతనేరస్థులు, వారి అనుచరుల హస్తం ఉందని ఊహగానాలు వస్తుండటంతో ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement