
‘ఎస్సీ’ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెస్తాం: వినోద్
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టకుంటే తామే ప్రైవేటు బిల్లు పెడతామని చెప్పారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ.. మాదిగల న్యాయమైన డిమాండ్‌కు సీపీఐ మద్దతు తెలుపుతోందని పేర్కొన్నారు.
బీసీల్లో గ్రూపులు ఉన్నట్లుగానే ఎస్సీలో కూడా ఏ, బీ, సీ, డీ గ్రూపులను విభజించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.