నన్పై గ్యాంగ్ రేప్ : ప్రధాన నిందితుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నన్పై గ్యాంగ్ రేప్ : ప్రధాన నిందితుడి అరెస్ట్

Published Sat, May 9 2015 9:52 AM

నన్పై గ్యాంగ్ రేప్ : ప్రధాన నిందితుడి అరెస్ట్

కోల్కత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా నన్పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మిలాన్ సర్కార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. సెల్దా రైల్వే స్టేషన్లో మిలాన్ శంకర్తో పాటు అతడి ముఖ్య అనుచరుడు అహిదుల్ ఇస్లాం అలియాస్ బాబును కూడా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిలాన్, బాబు ఇద్దరు బంగ్లాదేశ్లోని జీస్సోర్ నుంచి వచ్చారని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లా గంగ్నాపూర్ రాణాఘాట్ కాన్వెంట్లోకి ఈ ఏడాది మార్చి 13 తేదీ ఆర్థరాత్రి 12 మంది యువకులు చోరబడ్డారు. అనంతరం కాన్వెంట్లోని 72 ఏళ్ల నన్పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత లాకర్లోని రూ. 12 లక్షలు దోచుకుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే  ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు. దీంతో మమతాబెనర్జీ స్పందించి... సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement