అబ్బాయ్కు బాబాయ్ మద్దతు | Want Akhilesh as CM if SP wins 2017 polls: Shivpal | Sakshi
Sakshi News home page

అబ్బాయ్కు బాబాయ్ మద్దతు

Oct 16 2016 9:00 AM | Updated on Sep 4 2017 5:25 PM

అబ్బాయ్కు బాబాయ్ మద్దతు

అబ్బాయ్కు బాబాయ్ మద్దతు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఊహించని మద్దతు లభించింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఊహించని మద్దతు లభించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మళ్లీ విజయం సాధిస్తే అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ పేరును తాను ప్రతిపాదిస్తానని తెలిపారు.

ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారంటూ ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ములాయం ప్రకటనతో ఆయన కుమారుడు అఖిలేష్ షాకయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనతో విబేధిస్తున్న బాబాయ్ శివపాల్ అండగా నిలబడటం అఖిలేష్కు ఊరట కలిగించే విషయం. సమాజ్వాదీ పార్టీలో విభేదాలు లేవని, అందరూ ఐకమత్యంగా ఉన్నామని శివపాల్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement