
వివో కొత్త '4జీ' స్మార్ట్‌ఫోన్
చైనీస్ స్మార్ట్ ఫోన్ వివో సంస్థ కొత్తగా వాయిస్ కాల్స్ ఎల్టీఈని సపోర్టుచేసే '4జీ' స్మార్ట్‌ఫోన్ ను బుధవారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ ఫోన్ వివో సంస్థ కొత్తగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వాయిస్ కాల్స్ ఎల్టీఈని సపోర్టుచేసే '4జీ' స్మార్ట్‌ఫోన్ ను బుధవారం విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.7,490లుగా నిర్ణయించింది. తమ విలువైన వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించే నిబద్ధతతో ఉన్నామని వీవో ఇండియా సీఎంవో ఒక ప్రకటనలో తెలిపారు.
వివో '4జీ' ఫీచర్లు...
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
4.5 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్(854x480 పిక్సెల్)
3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ,
2000 ఎంఏహెచ్ బ్యాటరీ