మీడియాకు దూరంగా టీమిండియా ఫుల్‌ ఎంజాయ్‌! | Virat Kohli's teamIndia revel in london | Sakshi
Sakshi News home page

మీడియాకు దూరంగా టీమిండియా ఫుల్‌ ఎంజాయ్‌!

May 30 2017 9:41 AM | Updated on Sep 5 2017 12:22 PM

మీడియాకు దూరంగా టీమిండియా ఫుల్‌ ఎంజాయ్‌!

మీడియాకు దూరంగా టీమిండియా ఫుల్‌ ఎంజాయ్‌!

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు మీడియా కంటికి దూరంగా ఉంటూ.. తీరిక సమాయాన్ని బాగా ఆస్వాదిస్తోంది.

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు మీడియా కంటికి దూరంగా ఉంటూ.. తీరిక సమాయాన్ని బాగా ఆస్వాదిస్తోంది. ఆదివారం న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్ ముగిశాక టీమిండియా సభ్యులు లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, అజింక్యా రహానే, కేదార్‌ జాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితర భారత క్రికెటర్లు రెస్టారెంట్‌లో సరదాగా డిన్నర్‌ చేశారు.

ఈ వారం నుంచి ప్రారంభంకానున్న చాంపియన్స్‌ ట్రోఫీలో సత్తా చాటాలని టీమిండియా భావిస్తున్న సంగతి తెలిసిందే.  డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన భారత జట్టు తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంటామని చెప్తోంది. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 45 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌ అనంతరం దొరికిన తీరిక సమయాన్ని టీమిండియా సభ్యులు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తోటి బ్యాట్స్‌మెన్‌తో సరదాగా డిన్నర్‌ చేసిన ఫొటోను ఉమేశ్‌ యాదవ్‌ ట్విట్టర్‌లోప పోస్టు చేశాడు. జట్టు సభ్యులతో సరదాగా గడిపానంటూ కామెంట్‌ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్‌ కోహ్లి కూడా రెస్టారెంట్‌లో జట్టు సభ్యులతో కలిసి దిగిన సెల్ఫీని ట్వీట్‌ చేసి.. వర్క్‌ పరంగా బాగా గడిచింది. అనంతరం బాయ్స్‌తో కలిసి గతరాత్రి డిన్నర్‌ చేశామంటూ పోస్టుచేశాడు. ఇతర టీమిండియా సభ్యులు కూడా ఆనందంగా ఉన్న ఫొటోలను ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement