అతను నాతో ప్రేమలో పడ్డాడు! | Vin Diesel is in love with me, says Deepika | Sakshi
Sakshi News home page

అతను నాతో ప్రేమలో పడ్డాడు!

May 22 2017 12:51 PM | Updated on Sep 5 2017 11:44 AM

అతను నాతో ప్రేమలో పడ్డాడు!

అతను నాతో ప్రేమలో పడ్డాడు!

ఉన్నదున్నట్టు చెప్పాలంటే అతను నాతో ప్రేమలో పడ్డాడు

ముంబై: 70 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం కోరుకుంటారు. ఓ అందమైన కుటుంబం. ప్రశాంతమైన జీవితం. తనకు కూడా అవే కావాలంటోంది బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే. 70 ఏళ్ల వయస్సులో ఆనందకరమైన కుటుంబం, ప్రశాంతమైన జీవితాన్ని తాను కోరుకుంటున్నట్టు ఆమె తెలిపింది.

70 కేన్స్‌ చలనచిత్రోత్సవంలో స్టైలిష్‌గా దర్శనమిచ్చి ఈ సుందరి అందరి మతిపోగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్రెంచ్‌ 24 మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘నాకు 70 ఏళ్లు వచ్చాక అందమైన పరిసరాల్లోని ఓ చిన్ని ఇంటిలో పిల్లలు, మనవలతో ఆనందంగా గడుపాలనుకుంటున్నాను. అప్పుడు  ప్రశాంతమైన మంచి జీవితం ఉంటే చాలు’ అని చెప్పుకొచ్చింది.

‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాతో హాలీవుడ్‌లో ఎంటరవ్వడంపై స్పందిస్తూ తన సహనటుడు విన్‌ డిజిల్‌ కారణంగానే తాను సినిమాలో నటించినట్టు చెప్పింది. ఈ సినిమా ఎన్నో అద్భుతమైన అనుభవాలను తనకిచ్చిందని తెలిపింది. ‘ఉన్నదున్నట్టు చెప్పాలంటే అతను (విన్‌ డీజిల్) నాతో ప్రేమలో పడ్డాడు. అతను ఎంతో సౌమ్యుడు. నేను కలిసి వాళ్లలో అద్భుతమైన వ్యక్తి. ఉదార స్వభావం కలవాడు. అతని వల్ల నాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు మిగిలాయి. జీవితకాలానికి అతను నా స్నేహితుడు’ అని బాలీవుడ్‌ మస్తానీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement