వీనస్.. ఓ సెలబ్రిటీ | Venus is a celebrity | Sakshi
Sakshi News home page

వీనస్.. ఓ సెలబ్రిటీ

Dec 14 2015 4:03 AM | Updated on Oct 22 2018 6:02 PM

వీనస్.. ఓ సెలబ్రిటీ - Sakshi

వీనస్.. ఓ సెలబ్రిటీ

ఫేస్‌బుక్ పేజీకి 10 లక్షల లైకులు.. ఇన్‌స్టాగ్రాంలో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు.. కుప్పలు తెప్పలుగా ఫ్యాన్స్..

ఫేస్‌బుక్ పేజీకి 10 లక్షల లైకులు.. ఇన్‌స్టాగ్రాంలో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు.. కుప్పలు తెప్పలుగా ఫ్యాన్స్.. మరీ ఇంతలా క్రేజ్ ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా..! ఫొటోలో ఉన్న ఈ పిల్లి గారే. ముఖానికి ఓ వైపు నల్ల రంగు, మరో వైపు ఆరెంజ్ రంగు ఉన్న ఈ పిల్లి పేరు వీనస్. ఉత్తర కరోలినాకు చెందిన దీని యజమానులు క్రిస్టియానా, క్రిస్.. వీనస్ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీ నడుపుతున్నారు. కాస్త డిఫరెంట్‌గా ఉండేసరికి రోజురోజుకు దీని ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతోంది.

అయితే వీనస్ ముఖానికి రంగు వేసి పోస్ట్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ‘కనీసం కళ్లకు కాటుక కూడా పెట్టుకోలేదు’  అంటూ వారికి కౌంటర్ ఇస్తున్నారు వీనస్ యజమానులు. ఏదైతేనేం ఇప్పుడు సోషల్ మీడియాలో వీనస్ సంచలనం సృష్టిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement