రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు | venkaiah naidu takes on opposition parties | Sakshi
Sakshi News home page

రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు

Dec 29 2016 5:14 PM | Updated on Sep 27 2018 9:08 PM

రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు - Sakshi

రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు

పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తాము యజ్ఞం చేస్తుంటే, రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు జనవరి చివరి నాటికి తొలగిపోతాయని చెప్పారు. భూములు, ఇళ్ల ధరలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తామని చెప్పారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై హైకోర్టు నోటీసులకు సమాధానమిస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు. జయలలితకు చికిత్స చేసిన చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు చెప్పిన వివరాలను నమ్ముతున్నామని అన్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన విషయం విదితమే. సెప్టెంబర్‌ 22న  జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలను వెల్లడించాలని కోరుతూ చెన్నైకు చెందిన జోసెఫ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును గురువారం విచారించిన మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement